Rohit Sharma Record: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్, టీ 20 సిరీస్ లు ఆడుతున్న క్రమంలో టెస్ట్ సిరీస్ డ్రాగా ముగించింది. దీంతో ఇంగ్లండ్ సేనల పని పట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు నడిచింది. విజయం ముంగిట నిలిచి ప్రత్యర్థి జట్టు ఆశలు గల్లంతు చేసింది. మూడు మ్యాచుల్లో రెండు మ్యాచులు గెలిచి 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ కు సవాలు విసిరింది. టెస్ట్ మ్యాచులో ఫలితం తేలకుండా చేసిన జట్టుకు రోహిత్ సేన దీటైన జవాబు చెప్పింది. మరోవైపు రోహిత్ సేన అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తోంది. పద్నాలుగు మ్యాచుల్లో నెగ్గి తిరుగులేదని నిరూపించుకుంది. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఫలితాలను సాధించి పటిష్టంగా నిలిచింది. బౌలింగ్ లో బ్యాటింగులో తిరుగులేదని నిరూపించుకుంది. దీంతో ఇంగ్లండ్ ను డైలమాలో పడేసింది.
టీ 20 రెండో మ్యాచులో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ను భువనేశ్వర్, బుమ్రా బోల్తా కొట్టించారు. 121 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో ఇంగ్లండ్ ను అంతర్మథనంలో పడేసింది. టెస్ట్ సిరీస్ లో జరిగిన దానికి బదులు తీర్చుకుంది. రోహిత్ శర్మ వరుసగా పద్నాలుగు మ్యాచులు గెలిచిన కెప్టెన్ గా రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం.

టీమిండియా సమష్టిగా రాణించి ఇంగ్లండ్ ను దెబ్బతీసింది. టెస్ట్ మ్యాచ్ లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుని తన సత్తా చాటింది. రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో ఇండియా తన ప్రతిష్ట నిలబెట్టుకుంది. టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకున్నా టీ 20లో మాత్రం దూకుడు పెంచింది. విజయాలు మూటగట్టుకుంది. ఇంగ్లండ్ ను మాత్రం కోలుకోలేని విధంగా పగ తీర్చుకుంది.
Also Read:Anchor Sreemukhi: బెడ్ పై అలా పడుకొని అందాల విందు పంచిన యాంకర్ శ్రీముఖి..