
Rishabh Pant: IPL 2023 సీజన్ లో భాగంగా ఢీల్లీ, గుజరాత్ ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి రానున్నారు. యాక్సిడెంట్ కారణంగా ఇంటికే పరిమితమైన రిషభ్ పంత్ ను మైదానినికి తీసుకొచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్ టీం ఇప్పటికే తీవ్రంగా కృషి చేసింది. ఇటీవల లక్నోతో ఆడిన మొదటి మ్యాచ్ లో డీసీ ఓటమిని చూసింది. ఇందుకు టీంలో రిషభ్ పంత్ లేకపోవడమూ ఓ కారణమని భావిస్తోంది. కొందరు ఆయన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషభ్ ను ఎలాగైనా స్టేడియానికి తీసుకురావాలని చూశారు. మొత్తానికి ఆయన స్టేడియానికి రావడంతో క్రీడాభిమానులు ఫుల్ ఖుషీతో ఉన్నారు.
కొన్ని నెలల కిందట రిషభ్ పంత్ కు యాక్సిడెంట్ జరిగింది. ఈ కారణంగా అతని మోకాలుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన పూర్తిగా నడవలేకపోతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. IPL 2023 సందర్భంగా అందరికీ రిషభ్ పంత్ గుర్తుకొచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే సమయంలో కొందరు పంత్ అంటూ నినాదాలు చేశారు. అయితే అంతకుముందే ఈ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రిషభ్ పంత్ మైదానంలో ఆడకపోయినా ఆయనన డగౌట్ లో కూర్చొబెట్టాలని బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టారు.
IPL 2023 సీజన్ మొదటి మ్యాచ్ కోల్పోయిన తరువాత ఢిల్లీ టీం రెండో మ్యాచ్ గుజరాత్ తో ఆడనుంది. ఇందుకు అరుణ్ జైట్లీ స్టేడియి సిద్ధమవుతోంది. అయితే ఈ మైదానానికి రిషభ్ పంత్ ను తీసుకురావాలని జట్టు నిర్వాహకులు ఇప్పటికే భావించారు. తమ జట్టుకు మద్దతుగా తీసుకొచ్చేందుకు బీసీసీఐ యాంటి కరప్షన్ అండ్ సెక్యూరిటీ అనుమతి తీసుకోవడానికి యత్నించారు. తొలి మ్యాచ్ లో మిస్సయిన పంత్ ను రెండో మ్యాచ్ లోనైనా కనిపిస్తే చాలని అనుకున్నారు. మొత్తంగా ఆయన స్టేడియానికి రావడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా డగౌట్ లోకి సాధారణ వ్యక్తులను ఎవరినీ రానివ్వరు. కానీ జట్టు మాత్రం ఏదో ఒకలా పంత్ ను మైదానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అభిమానులు కూడా పంత్ ను మిస్సవుతున్నారు కాబట్టి.. వారి కోరిక మేరకు ఆయనను తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా మొదటి మ్యాచ్ ను కోల్పోయిన ఢిల్లీ పంత్ మద్దతుతో రెండో మ్యాచ్ ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.