Rice Water Benefits: మొహం అందం గురించి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారా? ఎన్ని చేసినా ఫలితం శూన్యమా? అయినా ఒకే డోన్ట్ వర్రీ. సింపుల్ రెమెడీ ఒకటి ఉందండోయ్. అది గనుక ఉపయోగిస్తే మీకు మంచి స్కిన్ వస్తుంది. కొరియన్ గ్లాస్ స్కిన్ కూడా మీ సొంతం అవుతుంది. అమ్మో దానికి ఎంత ఖర్చు చేయాలో అనుకుంటున్నారా? ఏం కాదు. కేవలం బియ్యం వాటర్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ రైస్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?
బియ్యం నీటిలో లభించే పోషకాలు
బియ్యం నీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. లేదంటే ఈ ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని దెబ్బతీస్తాయి. వృద్ధాప్య సంకేతాలను ప్రోత్సహిస్తాయి. అందుకే వాటితో పోరాడటానికి మీకు ఈ బియ్యం నీరు మంచి ఔషధం.
ఇక ఇందులో అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని బలోపేతం చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వీటితో పాటు జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బియ్యం నీటిలో కనిపిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Also Read: Rayalaseema : స్వచ్ఛమైన నీళ్లు.. బండరాళ్లల్లో ఖనిజాలు.. రాయలసీమలో ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే?
బియ్యం నీటి ప్రయోజనాలు
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. నీరసాన్ని తొలగిస్తాయి.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని పోషిస్తుంది: బియ్యం నీరు చర్మాన్ని పోషించి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
చర్మం ఎరుపును తగ్గిస్తుంది: బియ్యం నీరు మంట, ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.
పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది: బియ్యం నీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు పిగ్మెంటేషన్‌ను తగ్గించి చర్మపు రంగును ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి.
మొటిమలను తగ్గిస్తుంది: బియ్యం నీరు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది .
సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది: బియ్యం నీరు సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
తయారీ:
బియ్యం నీళ్ళు తయారు చేయడం చాలా సులభం. బియ్యం కడిగి ఆ నీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ నీటిని మీ ముఖానికి టోనర్‌గా ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే, ఈ నీటిలో రోజ్ వాటర్ కలిపి కూడా ఉపయోగించవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఎలా వాడాలి అని కదా.. అయితే ముందుగా మీ ముఖాన్ని బాగా కడుక్కోండి. తర్వాత బియ్యం నీటిని కాటన్ బాల్ సహాయంతో మీ ముఖంపై అప్లై చేయండి. అలా అప్లే చేసి ఇలా కాసేపు వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
Also Read: Lemon Water: చలికాలంలో నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి హానికరమా? ఇందులో నిజమెంత?
ఈ విషయాలను గుర్తుంచుకోండి
బియ్యం నీళ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి 2-3 రోజులు వాడుకోవచ్చు. మీకు బియ్యం నీళ్లకు ఏదైనా అలెర్జీ ఉంటే, దానిని ఉపయోగించవద్దు. మీరు ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే, బియ్యం నీటిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. బియ్యం నీటిని జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది . మీరు ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి బియ్యం నీటిని కూడా ఉపయోగించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.