Homeలైఫ్ స్టైల్Retirement corpus 40 crore India: రిటైర్మెంట్ కోసం రూ. 40 కోట్లు సేవ్ చేయాలా.....

Retirement corpus 40 crore India: రిటైర్మెంట్ కోసం రూ. 40 కోట్లు సేవ్ చేయాలా.. ఎందుకు… నిపుణులు ఏమంటున్నారు..

Retirement corpus 40 crore India: ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించేవారు ఇప్పటి అవసరాలకే కాకుండా భవిష్యత్తులో తమ జీవితం బాగుండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా రకరకాల ఆర్టిక ప్రణాళికలు వేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈరోజుల్లో ఎక్కువ శాతం రిటైర్మెంట్ ప్లానింగ్లు అందుబాటులోకి రావడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్లాన్లు సరిపోతాయా? లేదా అప్పటివరకు పరిస్థితులు మారిపోతాయా? అన్న వాదన కొందరు చేస్తున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం ప్రస్తుతం నెలకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలు సంపాదన చేసేవారు.. రిటైర్మెంట్ వయసు వరకు వారికి రూ. 10 కోట్ల నిలువలు ఉండాలని అంటున్నారు. అలా ఉంటేనే అప్పటి జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. మరి రిటర్మెంట్ వయసుకు ఇంత డబ్బు అవసరం ఎందుకోసం? నిపుణులు చెబుతున్నది ఏమిటి?

ప్రస్తుతం కొంతమంది నెలకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు ఆదాయం పొందే వారి జీవితం హాయిగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే వారి ఖర్చులు మితిమీరితే మాత్రం ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత డబ్బు వచ్చిన వారైనా తమ ఫైనాన్స్ ప్లానింగ్ లేకపోతే ఎంత సంపాదించినా వృధానే అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు జీవితం బాగుంటేనే సరిపోదు.. భవిష్యత్తులో కూడా తమ జీవితం బాగుండాలని అనుకునేవారు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువనే డబ్బులు కూడా పెట్టుకోవాలని అంటున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరి ఆరోగ్య, ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకోసం ప్రీ ప్లాన్ గా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు నిలువ ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Dezerv కో ఫౌండర్ సందీప్ జెట్మాని ఓ సందర్భంలో దీనిపై చర్చించారు. ఆయన ప్రకారం ప్రస్తుతం నెలకు రూ. ఒకటి నుంచి రెండు లక్షల వరకు సంపాదించేవారు 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే సమయానికి కూడా నెలకు రూ. ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఖర్చులు ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే అప్పటివరకు వైద్య ఖర్చులతో పాటు ఇతర అవసరాల ఖర్చులకోసం ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాందే పరిస్థితులు మరికొన్ని రోజుల తర్వాత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం భారత్ లో సగటు వేతన జీవి చేసే పొదుపు తక్కువే నని అంటున్నారు. ఇప్పటి ఖర్చుల ప్రకారం చూస్తే రిటైర్మెంట్ అయ్యే వయసు నాటికి రూ. 40 కోట్ల అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగం చేసే సమయంలో కంటే రిటైర్మెంట్ అయినా తర్వాత ఉండే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తు కోసం సరైన ప్లానింగ్ లేకపోతే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఆ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular