https://oktelugu.com/

Relationship : పిల్లల కాపురాలు బాగుండాలంటే తల్లిదండ్రులు ఇలా చేయండి..

Relationship : ఉదయం లేవగానే పనులు చేసుకోవాల్సిన సమయంలో, రాత్రి పనుల సమయంలో ఫోన్ చేసి పదేపదే మాట్లాడుతుంటే తను కట్ చేయమని చెప్పలేదు. ఇంట్లో పని చేయలేదు. అందుకే సమయం చూసి ఫోన్ చేయాలి అంటారు నిపుణులు.

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2024 / 01:04 PM IST

    Relationship

    Follow us on

    Relationship : కని పెంచి పెద్ద చేసిన తర్వాత కూతురును మరొక ఇంటికి పంపించాలంటే ఏ తల్లిదండ్రికి అయినా తీరని దుఖం గానే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె నడిచిన బుడిబుడి అడుగులు, చేసిన అల్లరి, కేకలు, అన్నీ గుర్తు వస్తుంటాయి. నాన్న డబ్బులు ఇవ్వు, అమ్మ అన్నం పెట్టు, అంటూ మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఇల్లంతా ఇష్టంగా తిరిగే అమ్మాయి అత్తగారింట్లో ఇబ్బందులు పడుతుందంటే.. ఏడుస్తుంది అంటే బాధ అనిపిస్తుంది కదా. ఈ మధ్య చాలా మంది కాపురాలు ఇలాగే ఉంటున్నాయి.

    మరి పిల్లల జీవితం బాగలేదని తెలిస్తే తల్లిదండ్రి గుండె తట్టుకుంటుందా? కానీ కొన్ని సార్లు వారి జీవితాలు బాగున్నా కూడా అమ్మాయి తల్లిదండ్రుల వల్లనే గొడవలు జరుగుతుంటాయి. పంతాలకు పోయి, ఇగో వల్ల పిల్లల జీవితాలను నాశనం చేస్తుంటారు. వారి మాట నెగ్గాలనే పట్టుదల వల్ల అమ్మాయిని తెలియకుండానే ఇబ్బంది పెడుతుంటారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే ఇకనుంచి అయినా వీటిని మానుకోండి. కాస్త పిల్లల జీవితాలను వారికి వదిలేయండి. మీ ప్రమేయం లేని వారి జీవితం బాగుందంటే కాస్త మీ ఇగో, పంతం, కోపం, పట్టుదల వంటివి తగ్గించుకోండి.

    ఉదయం లేవగానే పనులు చేసుకోవాల్సిన సమయంలో, రాత్రి పనుల సమయంలో ఫోన్ చేసి పదేపదే మాట్లాడుతుంటే తను కట్ చేయమని చెప్పలేదు. ఇంట్లో పని చేయలేదు. అందుకే సమయం చూసి ఫోన్ చేయాలి అంటారు నిపుణులు. అంతేకాదు కుదిరితే వారు ఫోన్ చేసేవరకు వెయిట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం బంగారం కొనలేదా? మీ ఆయన జీతం ఎంత? అత్త మామ ఎలా చూసుకుంటున్నారు? ఆడపడుచు పోరు ఉందా? మర్ది మాట వినడం లేదా? తోటి కోడలు తోడేస్తుందా వంటి ప్రశ్నలు అడగకూడదు.

    ఈ విషయాలు వారు పట్టించుకోకున్నా మీరు అడిగే ప్రశ్నల వల్ల వారి మనసులో మరింత నాటుకొని పోతాయి. ఏమైనా సమస్యలు ఉంటే సర్దుకొని పోవాలి తల్లి అని చెప్పాలి తల్లిదండ్రులు. పంతానికి పో, ఎక్కిన మంచం దిగవద్దు, భర్తను కొంగున ముడేసుకో, ఇంట్లో పెత్తనం చెలాయించు అంటూ నెగిటివ్ ఆలోచనలను మీ కూతురు మనసులో రానివ్వకండి. వారి జీవితం బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ మీరే సమస్యలు తేవద్దు అంటున్నారు నిపుణులు. మరి అమ్మాయి తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త.