Fertile Window Timing:పెళ్లయిన తర్వాత చాలామంది ఆలోచించేది సంతానం కోసమే. కానీ కొందరికి అనుకున్న సమయంలో సంతానం కలగదు. సాధారణంగా పెళ్లయిన మూడు లేదా ఆరు నెలల కాలానికి గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొందరు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దని అనుకునే వారు ఉన్నారు. అలా కాకుండా కావాలని అనుకున్న వారికి కూడా ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఒకరిని మాత్రమే నిందిస్తూ ఉంటారు. కానీ ఇద్దరి కలయిక వల్ల ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది అనేది వైద్యుల మాట. ఈ ప్రెగ్నెన్సీ అనుకున్న సమయంలో విజయవంతం కావాలంటే ఫ్రీ ప్లాన్ కూడా ఉండాలి. అంటే ఆడ, మగ కలయిక కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉండడంవల్ల ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. మరి ఏ రోజుల్లో కలయిక ఉంటే గర్భం ఏర్పడుతుంది? ఇది ఎలా జరుగుతుంది?
Also Read: వాట్సాప్‌లో ఇది తెరిచారో మీ డబ్బులు గోవిందా..
ఆడవారి జీవితంలో ఐదోతనం అమ్మ కావడం. ఇందుకోసం కొందరు ఎంతో ఆరాటపడతారు. కానీ నేటి కాలంలో వాతావరణ కాలుష్యం, కల్తీ మయమైన ఆహారం తినడం వల్ల అనేక అనారోగ్యాలు చేరి అనుకున్న సమయానికి ప్రెగ్నెన్సీ రావడం లేదు. కేవలం ఈ కారణాలు మాత్రమే కాకుండా స్రీ, పురుషుల కలయికలో లోపం ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అంటే సరైన సమయంలో కలయిక లేకపోవడం వల్ల గర్భం ఏర్పడడంలో సమస్యలు వస్తుంటాయి.
కొందరు ప్రముఖ వైద్యులు చెబుతున్న ప్రకారం ఆడవారిలో పీరియడ్స్ వచ్చి 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో పురుషుడి శుక్రకణాలు కలవడం వల్ల పిండం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పీరియడ్స్ కంటే 14 వ రోజు తర్వాత నాలుగు రోజులు… 14వ రోజు కంటే ముందు నాలుగు రోజులు.. కలయిక ఉండాలి. అయితే కచ్చితంగా నాలుగు రోజులు ఉండాలని కాదు.. డే బై డే ఉన్న పురుషుడి శుక్రకణాలు అండాన్ని తాకే అవకాశం ఉంటుంది. అండం రిలీజ్ అయిన తర్వాత శుక్రకణాల కోసం వెయిట్ చేస్తుంది. ఈ సమయంలో ఒక్కటి అండం వద్దకు చేరినా.. పిండం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read: జాగ్రత్త..! ఇన్ స్టాగ్రామ్ లో ఇక అలాంటి పోస్టులు పెడితే జైలుకే..
అయితే చాలామందికి అవగాహన లేకుండా సమయపాలన లేకుండా కలయిక చేస్తున్నారు. దీంతో అవసరమైన సమయంలో దూరం ఉంటున్నారు.. ఫలితంగా గర్భం ఏర్పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇద్దరి కలయిక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఏదో చేస్తామా అన్నట్లు కాకుండా.. ప్రేమతో ఉంటే పురుషుడి లో శుక్రకణాల కౌంట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే పురుషుడిపై స్త్రీకి ఇష్టం ఉంటే అండం ఆరోగ్యావంతంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల ఇద్దరి కలయిక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలని చెబుతున్నారు. ఇలా ప్రయత్నించిన గర్భం ఏర్పడని సమయంలో వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు.