Bigg Boss Telugu 2025: బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ రీత్యా లక్షల మందికి ఆ షోలో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. కానీ కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. కాగా ఓ సూపర్ హిట్ సీరియల్ నటికి సైతం ఆ కోరిక ఉందట. నేను బిగ్ బాస్ కి వెళితే టైటిల్ నాదే అంటున్న ఆ సీరియల్ బ్యూటీ ఎవరో చూద్దాం…
Also Read: జబర్దస్త్ వదిలేయడానికి హైపర్ ఆదినే కారణం, రీతూ చౌదరి బయటపెట్టిన నిజం
సెలెబ్స్ ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. వారు ఏమి తింటారు? ఎలా ఉంటారు? సందర్భానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారి ఎమోషన్స్? ఫైటింగ్ స్పిరిట్? ఇలా పలు విషయాలపై ఆసక్తి ఉంటుంది. బిగ్ బాస్ షో ప్రధాన కాన్సెప్ట్ అదే. సిల్వర్ స్క్రీన్ లేదా బుల్లితెర సెలెబ్స్ ని మనం ఆన్ స్క్రీన్ మాత్రమే చూస్తాం. వారి రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. బిగ్ బాస్ రియాలిటీ షో ప్రముఖులను నాలుగు గోడల మధ్య ఉంచి, మానసిక, శారీరక పరీక్షలకు గురి చేస్తారు. అందుకే బిగ్ బాస్ ఇండియాలో గ్రాండ్ సక్సెస్. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ షో ప్రసారం అవుతుంది.
తెలుగులో 2017లో ప్రయోగాత్మకంగా మొదలైంది. అప్పటికి తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో పట్ల పెద్దగా అవగాహన లేదు. ఎన్టీఆర్ ఫస్ట్ హోస్ట్. ఎపిసోడ్స్ గడిచేకొద్దీ ఆ షోలో ఉన్న మజా ప్రేక్షకులు తెలిసొచ్చింది. దానికి తోడు చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ సెలెబ్స్ ఫస్ట్ సీజన్లో కంటెస్ట్ చేశారు. ఎన్టీఆర్, నాని మొదటి రెండు సీజన్స్ కి హోస్ట్స్ గా వ్యవహరించారు. వారిద్దరూ తప్పుకోవడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. 8 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ఆరంభం కానుంది. మరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
కాగా సీజన్ 9 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వారిలో సీరియల్ నటి దీపిక రంగరాజు ఒకరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తాను కంటెస్ట్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల మీద దీపిక స్పందించింది. ఈ మేరకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాను కాబట్టి బిగ్ బాస్ షోకి వెళ్ళలేను. ఒకవేళ సీరియల్ ముగిస్తే వెళతాను. నాకు అయితే ఎలాంటి కాల్ రాలేదు. బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. అవకాశం వస్తే తప్పకుండా వెళతాను. బిగ్ బాస్ కి వెళితే ఖచ్చితంగా కప్ నాదే. నాగార్జున గారు నా చేయి ఎత్తి విన్నర్ గా ప్రకటించాలి… అంటూ దీపిక గొప్ప ఆత్మవిశ్వాసం ప్రకటించింది.
Also Read: పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ! భర్తకు అలా షాక్
తమిళ అమ్మాయి అయిన దీపిక తెలుగు ఆడియన్స్ లో సైతం పాపులారిటీ తెచ్చుకుంది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పాత్రలో ఆమె చక్కని నటన కనబరుస్తుంది. కావ్య భర్త రాజ్ పాత్రను మానస్ చేస్తున్నాడు. వీరిద్దరి గిల్లికజ్జాలు ప్రేక్షకులను అలరిస్తాయి. పలు తెలుగు షోలలో దీపిక సందడి చేస్తుంది. ఆమె ఎనర్జీ నెక్స్ట్ లెవల్. వచ్చీ రాని తెలుగులో ఆమె చేసే కామెడీ కొత్తగా ఉంటుంది. మరోవైపు సీజన్ 9లో ఏకంగా 9 మంది సామాన్యులు ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. షోలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ టీమ్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram