Hindu Wedding Traditions: భారతదేశం సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు పుట్టినిల్లు. మనదేశంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. అందుకే విదేశీ వనితలు కూడా ఇక్కడి పద్ధతులు, కట్టుబొట్టు, ఆచారాలకు చాలా మంది ఈ మధ్య కాలంలో ఆకర్షితులవుతున్నారు. భారతీయ వైవాహిక జీవతంలో పాటించే ఆచారాలను, సంప్రదాయాలు, వస్త్రాధారణను వారు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విదేశీ వనితలు ఇక్కడి అబ్బాయిలను పెళ్ళి చేసుకుని నిజమైన భారత స్త్రీలుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది విదేశీ అమ్మాయిలు తెలుగింటి కోడళ్లుగా దర్శనమిచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.
అయితే, హిందూ సంప్రదాయంలో భర్త మరణించాక భార్య గాజులు, తాళిబొట్టు, మెట్టెలు తీసివేయడం గురించి చాలా మంది రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్తను కోల్పోయిన దు:ఖంలో భార్య ఉంటే అత్తింటి వారు బలవంతంగా తన సౌభాగ్యాలను తొలడించడంపై అనేక విమర్శలు ఎదురువుతున్నాయి. దేశంలో ఇప్పటికీ సనాతన ధర్మం అమలు అవుతోందని, మహిళలను చిన్న చూపు చూస్తున్నారని.. భార్య చనిపోతే భర్త రెండో పెళ్లి చేసుకుంటే తప్పులేదు, అలాంటిది భర్త చనిపోతే భార్య రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదని చాలా మంది హేతువాదులు, ఫెమినిస్టులు మాట్లాడుతుంటారు. భర్త చనిపోయాక కూడా తాళి, మెట్టెలు, గాజులు ఎందుకు తీసేయాలని కూడా ప్రశ్నిస్తుంటారు. వాస్తవానికి గాజులు, మెట్టెలు, తాళిబొట్టు బలవంతంగా తొలగించాలని ఎక్కడా కండిషన్ లేదని, స్త్రీ తనంతట తానే స్వతహాగా తీసుకునే నిర్ణయం అని కొందరు అంటున్నారు.
మెట్టెలు, తాళిబొట్టు, గాజులు స్త్రీకి సౌభాగ్యంతో పాటు అందాన్ని ఇస్తాయి. కాళి రెండో వేలుకు మెట్టెలు ధరించడం వలన అది నేరుగా గర్భాశయానికి నేరుగా కనెక్ట్ అయ్యి ఉంటుందని, వాటిని చూసినప్పుడల్లా స్త్రీ తన కట్టుబాట్లను దాటి తప్పులు చేసేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. తన భర్తతో కలిసి ఆనందంగా ఉంటుందని, మెట్టెలు లేకపోతే వివాహితగా గుర్తించలేమని, సమాజంలో వివాహం అయిన మహిళలకు మాంగళ్యం, మెట్టెలు, గాజుల వలన గౌరవం కూడా దక్కుతాయన్నారు.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?
ఎప్పుడైతే భర్త చనిపోయాక స్త్రీ మెట్టెలు, తాళి, గాజులు తీసివేయడానికి ప్రధానకారణం ఎంటంటే.. తన సర్వస్వం అనుకునే వాడే లేనప్పుడు తాను అందంగా రెడీ ఎందుకు అవ్వాలి. మెట్టెలు, తాళి, గాజులతో తనకు ఇంకెమి పని ఉందని తీసి పక్కన పెడతారని వెల్లడించారు. అంతేకానీ భర్త చనిపోతే బలవంతంగా అవన్నీ తొలగించాలని శాస్త్రాలు, పురాణాల్లో ఎక్కడా చెప్పలేదని కొందరు స్పష్టం చేస్తున్నారు.