https://oktelugu.com/

Today Rasi Phalalu in Telugu: ఫిబ్రవరి 20, ఆదివారం, మాఘమాసం

Today Rasi Phalalu in Telugu: ఈరోజు మీ రాశుల పరంగా మీ ప్రయాణం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం. మేషం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులను పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వృషభం: ఈరోజు మీరు ఇతరులతో గౌరవంగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఇతరులకు సహాయం చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడతారు. మిథునం: ఈరోజు మీరు కష్టమైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 20, 2022 / 09:01 AM IST
    Follow us on

    Today Rasi Phalalu in Telugu: ఈరోజు మీ రాశుల పరంగా మీ ప్రయాణం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.

    Today Rasi Phalalu in Telugu

    మేషం: ఈరోజు మీరు వాయిదా పడిన పనులను పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

    వృషభం: ఈరోజు మీరు ఇతరులతో గౌరవంగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఇతరులకు సహాయం చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడతారు.

    మిథునం: ఈరోజు మీరు కష్టమైన పనులు ఇష్టంగా చేస్తారు. అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

    కర్కాటకం: ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి నిరుత్సాహం చెందుతారు. సంతానం గురించి ఆలోచిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.

    సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

    కన్య: ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. మీ స్నేహితులతో వాదనలు దిగకండి.

    తుల: ఈ రోజు కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. వ్యాపారస్థులు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు. మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

    వృశ్చికం: ఈ రోజు మీరు అనవసరమైన వాటికి వాదనలకు దిగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

    ధనుస్సు: ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు అనవసరమైన ఆలోచనలు చేస్తారు.

    మకరం: ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో పాత గొడవల గురించి చర్చలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

    Also Read: ఒకే వేదిక‌పైకి చిరంజీవి, మోహ‌న్ బాబు.. వివాదాల‌కు చెక్ పెడతారా..!

    కుంభం: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. విదేశ బంధువుల నుండి శుభవార్త వింటారు. మీ స్నేహితులతో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంది.

    మీనం: ఈరోజు మీరు మీ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

    Also Read: అసలైన ప్రేమ అంటే సిరి-శ్రీహాన్ లదే.. షణ్ముఖ్-దీప్తి సునయన వీరిని చూసి నేర్చుకోవాలా?