Site icon OkTelugu

Gold And Sliver Prices: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం?

Gold And Sliver Prices: ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే మన దేశ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. బంగారాన్ని మన దేశ ప్రజలు పెట్టుబడిగా కూడా భావిస్తారు. బంగారంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు పెరగడం గమనార్హం.

Gold And Sliver Prices

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పెరుగుదలతో 50,510 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరుగుదలతో 46,300 రూపాయలుగా మారింది. వెండి ధరలు కూడా పెరగగా కిలో వెండి ధర 68,500 రూపాయలుగా ఉండటం గమనార్హం. గత రెండు రోజులుగా వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గినా అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పెరగడం గమనార్హం.

Also Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా?
బంగారం రేటుపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని బట్టి బంగారం రేట్లలో కొనుగోలు చేసే సమయంలో మార్పు ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. అయితే దేశీయ మార్కెట్ లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 108.20 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 94.62 రూపాయలుగా ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 110.67 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 96.08 రూపాయలుగా ఉండటం గమనార్హం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Also Read: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?

Exit mobile version