
Kedar Yoga: కేదార్ యోగా 500 ఏళ్లకోసారి వసతుంది. జాతకంలో 4 ఇళ్లల్లో 7 గ్రహాలు సంచరించే సమయంలో ఈ యోగం కలుగుతుంది. గ్రహాల కాలానుగుణంగా రాశి చక్రాలు మారుతుంటాయి. దీంతో మనకు శుభ, అశుభ ఫలితాలు వస్తుంటాయి. జీవితంలో కష్టాలు, నష్టాలు సహజమే. కొన్నాళ్లు చీకటి కొన్నాళ్లు వెలుగు ఉన్నట్లే కష్టసుఖాలు కూడా కావడి కుండలే. గ్రహాల్లో అరుదైన మార్పులు సంభవించినప్పుడు కొన్ని శుభాలు పలకరించడం మామూలే. ప్రస్తుతం కేదార్ యోగాతో ఈ నాలుగు రాశులకు అదృష్టం పట్టబోతోంది. వారి జాతకాలే మారబోతున్నాయి.
ఏప్రిల్ 23 నుంచి ఈ యోగం నాలుగు రాశుల వారికి దక్కనుంది. దీంతో వారికి ఆకస్మిక ద్రవ్య లాభాలు, వృత్తిలో పురోగతి సాధించడం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయి. మేష రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సూర్యుడు, గురుడు, రాహువు, బుధుడు వీరి జాకతంలో లగ్న గృహంలో ఉండటం వల్ల మేషరాశిలో నాలుగు గ్రహాలు ఉంటాయి. అంగారకుడు, చంద్రుడు మూడో ఇంట్లో ఉంటారు. శని ఆదాయ గ్రహంలో ఉంటాడు. దీంతో ఆకస్మిక ధనం అందుతుంది. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాబాలు పెరుగుతాయి.
మేషరాశి
కేదార్ యోగంతో సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. సప్తమ, తొమ్మిదో దశను మరియు శుభ స్థానాలతో ఏర్పడుతుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు , ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కార్యసిద్ధి ఉంది. దీనివల్ల మీరు సంఘంలో పరువు ప్రతిష్టలు పెంచుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. విజయాలు మీ సొంతం అవుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా రాజయోగం పట్టనుంది. ఆదాయం, వ్యయం బాగున్నాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు. కోర్టు కేసుల్లో విజయం మీదే. డబ్బు ఆదా చేసి పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మంచి స్థాయిలో ఉంటుంది. విదేశీయానం కూడా ఉంది. ఖర్చులు మాత్రం స్వల్పంగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి కేదార్ యోగంతో అన్ని మంచి శకునాలే కలుగుతాయి. వీరి జీవితం మారిపోతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి కూడా మంచి యోగం ఉంది. వీరి జాతకంలో సప్తమ, తొమ్మిదవ, దశమ మరియు శుభ స్థానాలు ఉన్నాయి. భాగస్వాముల నుంచి మంచి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు పొందే అవకాశం. వ్యాపారంలో మచి లాభాలు కలిగేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం విస్తరించుకుంటారు. ఇంకా అనేక లాభాలు పొందుతారు. కేదార్ యోగం వల్ల సింహరాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి

మకర రాశి
మకర రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. వివాహం కాని వారికి పెళ్లి యోగం ఉంది. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు. నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. అన్నింట్లో విజయం మీదే. దేనికి భయం వద్దు. ముందుకు వెళితే అన్ని మంచి ఫలితాలే ఎదురవుతాయి. ధైర్యంగా ఉండండి. మంచి ఫలితాలు సాధించుకోవచ్చు.