Rajasthani Diet Secrets: 20 ఏళ్లకే పొట్ట.. పాతిక సంవత్సరాలకే బట్ట.. 30 సంవత్సరాల లోపే మధుమేహం.. 40 సంవత్సరాల లోపే మోకాళ్ల నొప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. హాయిగా బతకడం దగ్గర నుంచి మొదలు పెడితే.. రోగాలు లేకుంటే చాలు అనే స్థాయికి మనిషి ఆరోగ్యం పడిపోయింది.
ముఖ్యంగా మన దేశం మధుమేహ రాజధానిగా మారిపోయింది. వయసు సంబంధం లేకుండా మధుమేహం అనేది ఇటీవల కాలంలో అందరిలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు జన్యుపరంగానే ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేవారు. కానీ ఇప్పటి జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో జన్యువులతో సంబంధం లేకుండా.. వంశపారంపర్యంగా కాకుండా మధుమేహం వచ్చేస్తున్నది. మధుమేహంతో పాటు రక్త పోటు కూడా ఇబ్బంది పెడుతున్నది. దీంతో చాలామంది అర్ధాంతరంగా కాలం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. జీవనశైలిని మెరుగుపరుచుకుంటున్నారు. అంతేకాకుండా సాధ్యమైనది వరకు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భోజనంలో అన్నాన్ని తగ్గించి ఎక్కువగా తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు.
Also Read: Food Label Symbols: ఫుడ్ ప్రొడక్ట్స్‌పై ఈ గుర్తులకు అర్థం తెలుసా?
వీరి ఆహార శైలి భిన్నం
మనదేశంలో ముఖ్యంగా రాజస్థాన్ వాసుల సగటు ఆయుర్దాయం ఇప్పటికీ దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో వృద్ధులు ఇప్పటికి తమ పని తాము చేసుకుంటున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా.. ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఇటీవల కొంతమంది అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. రాజస్థాన్ ప్రజలు తమ చేసుకుంటారు. ముఖ్యంగా యంత్రాల మీద ఆధారపడరు. అన్నిటికంటే సాంప్రదాయ ఆహార విధానాన్ని కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా గోధుమలతో తయారుచేసిన దాల్ బత్తి కా చుర్మా ను ఎక్కువగా తింటారు.. మాంసాహారానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటారు. గోధుమలు, జొన్నలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.. గోధుమ పిండిని లడ్డూల లాగా తయారుచేసి.. వాటిని మంటలలో కాల్చేస్తారు. తర్వాత అందులో పప్పు మిశ్రమం వేసుకొని తింటారు. దీనివల్ల వారి శరీరం సమర్థవంతంగా మారుతుందని.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని నమ్ముతుంటారు. ఎక్కువ శాతం శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు.. దగ్గర ప్రాంతాలు అయితే నడవడానికి ఇష్టపడుతుంటారు. వారు అందువల్లే ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.. జీవనశైలి వ్యాధులలో రాజస్థాన్ రాష్ట్రం దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఇదేనని అధ్యయనకారులు చెబుతున్నారు. “వారు ఆహారం తీసుకునే విధానం చాలా విభిన్నంగా ఉంది. ఉదయం త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటారు. వారి జీవనశైలిలో ఒంటె పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆ పాల ద్వారా తయారుచేసిన ఉత్పత్తులను వారు ఎక్కువగా స్వీకరిస్తున్నారు. గోధుమలతో తయారు చేసిన వంటకాలను కూడా ఆరగిస్తున్నారు. అందువల్లే వారి ఆరోగ్యం ఈ స్థాయిలో మెరుగ్గా ఉందని ” అధ్యయనకారులు చెబుతున్నారు.