Dhanush Tirupati Begging Scene Talk: చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ కి నేడు విడుదలైన ‘కుబేర'(Kubera Movie) చిత్రం కాస్త ఊరటని ఇచ్చింది. ఓవర్సీస్ లో మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి, నైజాం ప్రాంతంలో పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కేవలం ప్రధాన నగరాల్లో ఆక్యుపెన్సీలు మంచిగా నమోదు అవుతున్నాయి కానీ, B,C సెంటర్స్ లో మాత్రం అంతంత మాత్రం గానే ఉంది. టికెట్ రేట్స్ అత్యధికంగా ఉండడం వల్లే ఈ సినిమాకు క్రింది సెంటర్స్ లో కలెక్షన్స్ లేవని అంటున్నారు విశ్లేషకులు. రేపటి నుండి టికెట్ రేట్స్ తగ్గిస్తే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
“I play a beggar role in #Kuberaa, a completely unique role unlike anything I’ve done before.”
– #Dhanush’s bold words at the #Kuberaa3rdSingle launch! pic.twitter.com/SyC5vJnX71
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) June 10, 2025
ఇకపోతే ఈ చిత్రం లో ధనుష్(Dhanush) నటనకు సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. నేటి తరం హీరోలలో ధనుష్ కమల్ హాసన్ లాంటి నటుడని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఒక బహుమతి లాంటోడు అని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు ఒక తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో ధనుష్ సరదాగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘శేఖర్ కమ్ముల(Sekhar Kammula) గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాతో సినిమా చేసే ముందే నేను ఆయన సినిమాలు చూసి ఉన్నాను. అలాంటి డైరెక్టర్ తో సినిమా అంటే చాలా సంతోషించాను. ఎంతో ఉత్సాహం తో షూటింగ్ కి వెళ్తే నాకు బిచ్చ గాడి గెటప్ వేసి, చేతిలో చిప్ప పెట్టి, తిరుపతి రోడ్ల మీద కూర్చోబెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
A Gold Made of Trash
Win Big @dhanushkraja naa ❤️#Kuberaa pic.twitter.com/WtfFOWpmB6— Kokki Kumar Official™ (@kokiKumar_Offl) June 19, 2025
ధనుష్ మాట్లాడిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి షేర్ చేసి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు నేడు తెల్లవారు జామున ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్ తో పోలిస్తే ఇండియా లో షోస్ మొదలైన తర్వాత వచ్చిన టాక్ చాలా తేడా గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది సినిమా చాలా స్లో స్క్రీన్ ప్లే తో సాగింది, అనేక సన్నివేశాలను సాగదీశారు అని చెప్తున్నారు. ఇది యూత్ ఆడియన్స్ కి అనిపించొచ్చు కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఎక్కొచ్చని అంటున్నారు. లాంగ్ రన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ ఎలాగో బాగుంటుంది. సోమవారం నుండి కూడా ఇదే రేంజ్ ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.