Food Label Symbols: ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి. పెగురుతున్న బిజీ లైఫ్‌లో ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా రకరకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇండియాలో ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌కు మెలర్జీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కంట్రోల్ శాఖ వారు కొన్ని నిబంధనలు విధించాయి. ఆమేరకే ప్యాకేజ్డ్ ఫుడ్ విక్రయించాలి. అందుకు ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసేవారు వాటిపై కొన్ని సింబల్స్ ముద్రిస్తారు. అయితే వాటి గురించి, వాటికి అర్థాలు చాలా మందికి తెలియదు. కొన్ని సింబల్స్, వాటి అర్థాలు తెలుసుకుందాం.
బ్రౌన్ కలర్ సర్కిల్ లేదా ట్రయాంగిల్..
ఈ గుర్తు ప్యాకేజీ ఫుడ్‌పై ఉంటే అది పూర్తిగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని అర్థం. గతంలో ఈ సింబర్ సర్కిల్‌గా ఉండేది. దానిని ఇటీవల ట్రయాంగిల్‌గా మార్చారు. దీనికి కారణం కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారు ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది.
గ్రీన్ కలర్ డాట్..
ఇది కూడా చాలా ఫుడ్ ప్రొడక్ట్స్‌పై ఉంటుంది. దీని అర్థం అందులోని ఫుడ్ పూర్తిగా వెజిటేరియన్ అని అర్థం.
బ్లూ కలర్ డాట్..
ఇక చాలా ఫ్యాకెట్లపై బ్లూ కలర్ డాట్ సింబల్ కనిపిస్తుంది. దీని అర్థం అందులోని ప్రొడక్ట్‌లో షుగర్ తక్కువగా ఉంటుందని అర్థం.
గ్రీన్ కలర్ V సింబల్..
ఈ V సింబర్ గ్రీన్ కలర్‌లో ఫుడ్ ప్యాకెట్లపై ఉంటుంది. ఇది ఉంటే అది వేగన్ ఫుడ్ అని అర్థం. వేగన్ అంటే.. అందులో ఎలాంటి నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ లేవని అర్థం. అందులో జంతువుల నుంచి వచ్చే ఎలాంటì వ కలపరు. చివరకు పాలు కూడా.
X సింబర్..
ఇక కొన్ని ప్యాకెట్లపై X సింబర్ కనిపిస్తుంది. ఇది ఉంటే.. అది తినడానికి పనికిరాని ఆహారం అని అర్థం.
ఈ గుర్తుల గురించి తెలిస్తే ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.