IPL 2022 Rain Threat: ఐపీఎల్ సంరంభం కొనసాగుతోంది. ప్రేక్షకులకు పండుగ వాతావరణం కల్పిస్తోంది. కొత్తగా వచ్చిన జట్లు ప్లే ఆఫ్స్ కు చేరడంతో సీనియర్ జట్లు మాత్రం పోరాడి ఓడాయి. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్ జట్లు ప్లే ఆఫ్స్ జట్లుగా ఇప్పటికే లక్ష్యం చేరాయి. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య పోరు సాగనుంది. మూడు నాలుగో స్థానాల్లో నిలిచిన లక్నో సూపర్ జెయింట్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. వీటి మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది. దీంతో నాలుగు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఇందులో గెలిచిన జట్టే ఫైనల్ అర్హత సాధిస్తుంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్లే ఆఫ్స్ కు చేరిన జట్లకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వర్షం కారణంగా మ్యాచులు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఒకే ఓవర్ లో ఫలితం వచ్చేలా కొత్తగా రూల్ తెచ్చింది. ఒక్క ఓవర్ లో సాధించిన పరుగుల ఆధారంగా విజేను నిర్ణయిస్తారు. ఒక్క ఓవర్ కూడా ఆడటం సాధ్యం కాకపోతే పాయింట్ల ఆధారంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్ ఫైనల్ కు అర్హత సాధిస్తాయని తెలుస్తోంది. దీంతో వర్షం కారణంగా మ్యాచులు సాగవనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: RC15: వారిద్దరి మధ్య వాదన.. సైలెంట్ అయిపోయిన చరణ్
కోల్ కతలోని ఈడెన్ గార్డెన్ లో మొదటి ఫైనల్, ఎలిమినేటర్ మ్యాచులు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో ఈ మ్యాచులకు వర్షం అడ్డంకిగా మారనుంది. దీంతో ఒక వేళ వర్షం వచ్చినా రెండు గంటలు ఆలస్యంగానైనా మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వర్షం భారీగా కురిస్తే మ్యాచ్ సాధ్యం కాకపోతే డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజేత జట్టును ప్రకటిస్తారు. మొత్తానికి వర్షం దెబ్బకు ఐపీఎల్ విలవిలలాడుతోంది. పరుగుల వరద చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకుల కోరిక తీరుతుందా? లేక వర్షమే హరిస్తుందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

వర్షా ఎడతెరిపి లేకుండా కురిస్తే పరిమిత ఓటర్లు కేటాయిస్తారు. 5.5 ఓవర్లు ఇచ్చి ఆ సమయంలో తీసే పరుగుల మేరకు విజేతను నిర్ణయించే అవకాశం కూడా ఉంది. దీంతో జట్లు కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సారి వర్షాలు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్ల మెరుపు వేగాలు చూద్దామనుకుంటుంటే వర్షం విలన్ గా మారి మ్యాచుల ఫలితాన్ని హరించి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచులు ఈ సారి కనువిందు చేసినా ఫైనల్ మ్యాచులు మాత్రం అభిమానుల ఆనందానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
Also Read:ABN RK- KA PAUL: ఏబీఎన్ ఆర్కే పరువు గంగపాలు చేసిన కేఏ పాల్
[…] Also Read:IPL 2022 Rain Threat: ఐపీఎల్ ఫైనల్ మ్యాచులకు వానగం… […]