ABN RK -KA PAUL: ‘నువ్వు ఎవడితోనైనా పెట్టుకో.. కానీ కొంచెం తిక్కుండి.. కామెడీ టైమింగ్ ఎక్కువున్నోడితో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు’ అని ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణకు బాగా తెలిసివచ్చినట్టుంది.. పోయి పోయి కేఏ పాల్ తో పెట్టుకుంటే ఊరుకుంటాడా? చెడుగుడు ఆడేస్తాడు.. కేఏ పాల్ ధాటికి ‘ఫాఫం’ ఇప్పుడు మన ఆర్కే బాధితుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కార్యక్రమంలోనే రాధాకృష్ణకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టు మాట్లాడిన కేఏపాల్ ప్రశ్నల వీడియోలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆర్కే వ్యతిరేకులు ఆ వీడియోలను ట్రోల్స్ చేస్తూ పరువు తీసేస్తున్నారు.

ABN RK KA PAUL
నిజానికి అందరూ కేఏ పాల్ ను మాట్లాడితే ట్రోల్స్ చేస్తుంటారు. ఆయన మాటలపై మీమ్స్, ఎద్దేవా చేస్తూ నెటిజన్లు తెగ ఆడేసుకుంటారు. కానీ ఇక్కడ ట్రైయిన్ రివర్స్ అయ్యింది.
Also Read: Vladimir Putin: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్ గద్దె దించబోతున్నారా?
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కేసీఆర్ నుంచి మొదలుపెడితే చంద్రబాబు.. జగన్, షర్మిల సహా ఎంతో మంది రాజకీయ ఉద్దండులకే చమటలు పట్టేలా ప్రశ్నలు అడిగి వారి నుంచి నిజాలు రాబట్టి వైరల్ చేసే మనిషి. గతంలో వైఎస్ సహా ఎంతో మందితో పెట్టుకొని వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అలాంటి ఆర్కే ఇప్పుడు రాజకీయ కమెడియన్ గా పేరొందిన మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చేతిలో క్లీన్ బోల్డ్ అయ్యాడు. కేఏపాల్ ను ఎప్పుడూ మీడియా సీరియస్ గా తీసుకోలేదు. ఆయన కామెడీ ప్రసంగాలు వేస్తూ జనాలను ఎంటర్ టైన్ చేసేది. అలాంటి కేఏ పాల్ తో ఓపెన్ హార్ట్ చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ ఇప్పుడు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఈ ఇంటర్వ్యూలో కేఏ పాల్ విరుచుకుపడ్డాడు. ఆర్కేకు లెఫ్ అండ్ రైట్ ఇచ్చేశాడు.ఒక సమయంలో కేఏ పాల్ తెలివైన కౌంటర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రాధాకృష్ణలో చిరాకు, నిరాశ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
ఏబీఎన్ ఆర్కే ఫక్తు టీడీపీ మద్దతుగా ప్రశ్నలు వేస్తూ జగన్ కు వ్యతిరేకంగా అడుగుతుంటాడు. ఈసారి కూడా కేఏ పాల్ ను అలానే అడిగి బుక్కయ్యాడు. కేఏ పాల్ ను హ్యాండిల్ చేయలేక రాధాకృష్ణ చివరకు ఇంటర్వ్యూను మద్దలోనే వదిలేసిన పరిస్తితి కనిపించింది.
కేఏ పాల్ జోకులు పేల్చుతూ.. స్పాంటేనియస్ గా ఆర్కే కు కౌంటర్లతో విరుచుకుపడుతూ.. టీడీపీ ప్రతిష్టను దెబ్బకొట్టేలా చాలా వ్యాఖ్యలు చేశారు. ఆర్కే ఎదుటివారిని అస్సలు మాట్లాడనీయకుండా ప్రశ్నలు సంధిస్తుంటారు. కానీ ఇక్కడ కేఏపాల్ ఆయన నోరు మూయించడం విశేషం. ‘”ఎక్కడైనా ప్రశ్న చిన్నదిగా ఉండాలి మరియు సమాధానం చాలా పొడవుగా ఉంటుంది. నేను సమాధానం చెబుతాను. మీరు వినండి” అంటూ ఆర్కే దూకుడుని కేఏ పాల్ కంట్రోల్ చేసిన విధానానికి సోషల్ మీడియాలో విజిల్స్ పడుతున్నాయి.

KA PAUL
“చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే పనిలో ఉన్నట్టున్నారు మీరు. కానీ ఆయన దేవుడి శాపానికి గురై అసెంబ్లీ లోపలా బయటా ఏడుస్తున్నారు” అంటూ చంద్రబాబును, ఆర్కేను కేఏ పాల్ కడిగేసిన విధానం హైలెట్ గా మారింది. ఇక మీ ప్రశ్నలన్నీ చంద్రబాబును సీఎం చేయడానికే అన్నట్టు ఉన్నాయని ఆర్కే ముఖం మీదనే కేఏపాల్ అనేశాడు. దీనికి ఏం చెప్పాలో తెలియక ఆర్కే బిక్కముఖం వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Malla Reddy vs Revanth Reddy: మల్లారెడ్డి వ్యాపారాలను రేవంత్ అందుకే టార్గెట్ చేస్తున్నారా!?
కొన్ని సమయాల్లో అయితే కేఏ పాల్ ఏకంగా ఆర్కేపై అరిచేశాడు. ‘ఏం అర్థం లేని విధంగా మాట్లాడుతున్నావు?’ మీ మనసు మీ దగ్గర ఉందా? అని ఆర్కేని లైవ్ లోనే తూర్పారపట్టారు.
ఈ మొత్తం ఇంటర్వ్యూ చూస్తే ప్రతీసారి ఆర్కే డామినేషన్ కొనసాగేది. కానీ ఈసారి ట్రెయిన్ రివర్స్ అయ్యి కేఏపాల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ‘కళ్లున్నోడు (ఆర్కే) ముందు మాత్రమే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడని’ ఆర్కే వ్యతిరేకులంతా ఇప్పుడు కేఏపాల్ ను ఆకాశానికెత్తేస్తూ పోస్టులు పెడుతుండడం విశేషం. ఎంత రాజకీయ కమెడియన్ అయినా కేఏపాల్ తో వాదించడం కష్టం అని ఆర్కేకు ఈ ఇంటర్వ్యూ ద్వారా బోధపడడం విశేషం.