RC15: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా జరుగుతుంది. హైదరాబాద్, రాజమండ్రి, పూణె, రాజస్థాన్.. ఇలా రకరకాల లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే, ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు ? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఖరారు అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాక్ చేశారు. కానీ, నిర్మాత దిల్ రాజు ‘ఎఫ్ 3’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా, ఈ సినిమా హడావుడి తగ్గాకే, లుక్ రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు.

పైగా ఈ సినిమా టైటిల్ విషయంలో నిర్మాత దిల్ రాజు బాగా అసంతృప్తిగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ 2 టైటిల్స్ అనుకున్నాడు. తమిళ వెర్షన్ కు ఒక టైటిల్, తెలుగులో మరో టైటిల్ పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ, తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషలకు కలిపి ఒకే కామన్ టైటిల్ అయితే బాగుంటుంది అని దిల్ రాజు ఆలోచన. గత కొన్ని రోజులుగా శంకర్ – దిల్ రాజు మధ్య టైటిల్ విషయంలో చిన్నపాటి వాదనలు కూడా జరిగాయి. ఈ వాదనలో చరణ్ సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ABN RK- KA PAUL: ఏబీఎన్ ఆర్కే పరువు గంగపాలు చేసిన కేఏ పాల్
కాగా రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం చెర్రీ కొడుకు పాత్రకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం వరకూ ఈ సినిమా షెడ్యూల్ జరగనుంది.

ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. ఎలాగూ ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు.
అన్నిటికి మించి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. అందుకే ఈ భారీ పాన్ ఇండియా పొలిటికల్ సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పని చేస్తున్నాడు.
Also Read:Samantha: ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన సమంత.. హాట్ ఫొటోలు వైరల్
[…] […]
[…] […]
[…] […]