
Railway Jobs 2021: దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా అదే సమయంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తాజాగా రైల్వే శాఖకు సంబంధించి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు జోన్లకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం 2226 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం నవంబర్ 10వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. 100 రూపాయలు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. https://wcr.indianrailways.gov.in/uploads/files/1633610522727-notification%20act%20apr%20for%202021_22.pdf లింక్ ద్వారా నోటిఫికేషన్ ను చూడవచ్చు. https://wcr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,7,288,1391,2088 లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.