Jackky Bhagnani, Rakul: ఒక స్టార్ హీరోయిన్ ప్రేమిస్తోంది అంటే… ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్, బ్యాక్ ప్రాపర్టీస్ చూసుకునే ప్రేమిస్తోంది. పైగా ‘రకుల్ ప్రీత్ సింగ్’ లాంటి పక్కా కమర్షియల్ హీరోయిన్ ప్రేమలో పడింది అంటే.. అతను కచ్చితంగా ఆమె కంటే స్థాయిలో స్తోమత లో ఉన్నతమైన వ్యక్తే అయి ఉంటాడు. ఇంతకీ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రేమిస్తోన్న జాకీ భగ్నానీ ఎవరు ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే..

బాలీవుడ్ లోనే ఓ దశలో టాప్ నిర్మాతగా కొనసాగిన ‘వశు భగ్నానీ’ తనయుడే ఈ ‘జాకీ భగ్నానీ’. స్వస్థలం కోల్‌కతా, జాకీ భగ్నానీ న్యూయార్క్ లోని ‘లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ది ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’లో తన ఉన్నత విద్యతో పాటు అక్కడే యాక్టింగ్ కోర్సు ను కూడా పూర్తి చేశాడు. మొదటి సినిమాతోనే బాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరాలని చాలా ప్రయత్నాలే చేశాడు.
కానీ కాలం కలిసి రాలేదు, అంగబలం, ఆర్థిక బలం ఉన్నా.. అతన్ని అవేవీ స్టార్ ను చేయలేకపోయాయి. దాంతో ‘రెహ్నా హై తేరే దిల్ మే’ అనే సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఆ తర్వాత దాదాపు నలభై కథలు విని ‘కల్ కిస్నే దేఖా’ అనే సినిమాతో హీరోగా హిందీ తెరకు పరిచయమయ్యాడు. ఐతే, ఆ సినిమా అతని పరువు తీసింది. ఆ రేంజ్ లో డ్యామేజ్ అయింది ఆ సినిమా.
ఆ తరవాత ‘ఫాల్తు’, ‘అజబ్ గజబ్ లవ్’, ‘యంగిస్థాన్’, ‘వెల్‌కమ్ టు కరాచీ’ లాంటి సినిమాలు చేసినా.. ‘జాకీ భగ్నానీ’ కి స్టార్ డమ్ మాత్రం రాలేదు. కనీసం హీరోగా కూడా గుర్తింపు రాలేదు. దాంతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ‘మెహిని’ అనే సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ పాప్ కార్న్ డబ్బులు కూడా తిరిగి రాలేదు.
దాంతో ‘జాకీ భగ్నానీ’ నిర్మాతగా కూడా మారాడు. ‘సర్జ్బిత్’, ‘దిల్ జంగ్లీ’, ‘వెల్‌కమ్ టు న్యూయార్క్’, ‘కూలీ నం. 1’, ‘బెల్ బాటమ్’ లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే నిర్మాతగా కూడా ‘జాకీ భగ్నానీ’ సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ‘బెల్ బాటమ్’ సినిమాకి దాదాపు 70 కోట్లు నష్టాలు వచ్చాయి. మొత్తానికి హీరోగా నిర్మాతగా సంపూర్ణంగా ఫెయిల్ అయిన ‘జాకీ భగ్నానీ’ ను రకుల్ ఎందుకు ప్రేమించింది అంటే ?
‘జాకీ భగ్నానీ’ ఆస్తుల విలువ దాదాపు మూడు వేల కోట్లు. కోల్‌కతాలో ఉన్న సంపన్న కుటుంబాల్లో అతని కుటుంబం కూడా ఒకటి. 1984, డిసెంబరు 25న జన్మించిన ‘జాకీ భగ్నానీ గతంలో ఓ హీరోయిన్ తో సన్నిహితంగా ఉన్నాడు. అయితే, కొన్ని కారణాలతో అతను ఆమెతో విడిపోయాడు. ప్రస్తుతం జాకీ భగ్నానీ.. అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇంకా పేరు పెట్టని ఆ సినిమా నిర్మాణ క్రమంలోనే ‘జాకీ భగ్నానీ’కి, రకుల్ ప్రీత్ సింగ్ కి మధ్య పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా చిగురించి… సోషల్ మీడియాలో పబ్లిక్ గా వ్యక్తపరిచే వరకూ వెళ్ళింది. అయితే, ‘జాకీ భగ్నానీ’కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరితో ఎక్కువ కాలం రిలేషన్ లో ఉండడు. మరి రకుల్ తో ఎంత కాలం ఉంటాడో చూడాలి.
ఇటు రకుల్ కూడా పలువురి హీరోలతో పాటు కొందరు రాజకీయ నాయకులతో కూడా డేటింగ్ చేసిందనే పుకార్లు ఉన్నాయి. అయితే, ఎన్నడూ తన ప్రేమ వ్యవహారాల గురించి రకుల్ ఓపెన్ గా ఎప్పుడూ చెప్పలేదు. ఒక్క జాకీ గురించి మాత్రమే ఆమె బహిరంగంగా ప్రకటించింది. కానీ, ఆమెను తమ కోడలిగా జాకీ పెద్దల నుంచి అంగీకారం మాత్రం రావడం లేదట. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ కి తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోయినా.. హిందీలో ఏడు సినిమాలు చేస్తోంది.