Raft Motors Electric Scooter:దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేయగా మరికొన్ని కంపెనీలు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటం గమనార్హం.

తాజాగా రాఫ్ట్ మోటార్స్ అనే మరో కంపెనీ సైతం ఇండస్ ఎన్ఎక్స్ పేరుతో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ ను తెచ్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2021 సంవత్సరం నవంబర్ 2వ తేదీన కంపెనీ ఈ స్కూటర్ ను రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 480 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్లలో ఎకో మీడ్, స్పీడ్ మోడ్ ఉంటాయని సమాచారం.
స్పీడ్ మోడ్ లో గంటకు గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చని కంపెనీ చెబుతుండగా ఎకో మోడ్ లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 550 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి వస్తుండగా 480 కిలోమీటర్ల దూరం ప్రయాణించే స్కూటర్ ధర 2,57,431 రూపాయలుగా ఉంది. 325 కిలోమీటర్లు ప్రయాణం చేసే స్కూటర్ ధర 1,91,971 రూపాయలుగా ఉంది.
165 కిలోమీటర్ల స్కూటర్ ధర 1,18,500 రూపాయలుగా ఉండగా సాధారణ ఛార్జర్ తో ఈ స్కూటర్ ను ఫుల్ ఛార్జ్ చేయాలంటే 8 నుంచి 24 గంటల సమయం పడుతుంది. కంపెనీ అందించే ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 5 గంటల్లో ఈ స్కూటర్ ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ గరిష్ట స్పీడ్ 50 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం.