AP Power Cuts: అప్పుల కోసం ఏం చేయడానికి అయినా వెనకాడట్లేదు జగన్ ప్రభుత్వం. ఫలితంగా జనాలపై అనవసర భారాలు పడుతున్నాయి. కొత్త అప్పులు చేయడానికి ఇంతలా ప్రయత్నిస్తున్న జగన్.. ఉన్న అప్పులను తీర్చడానికి మాత్రం కొంతలో కొంతైనా ప్రయత్నించట్లేదు. తద్వారా ఏపీ ప్రజల భవిష్యత్‌పై దారుణమైన దెబ్బ పడుతోందనే చెప్పుకోవాలి.

ఇప్పుడు కొత్త అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన పని వల్ల ఏపీ ప్రజలు కరెంట్ కోతలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ సంస్కరణలు కూడా అమలుచేస్తామని రాత పూర్వక పత్రం ఇచ్చింది. ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే.. మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ విధానం ప్రకారం.. పాత అప్పులు ఉన్న ప్రభుత్వాలు కొత్త అప్పులు చేయడానికి వీల్లేదు. పైగా విద్యుత్ బకాయిలు ఉంటే కొత్తగా విద్యుత్ కొనేందుకు వీల్లేదు.
Also Read: AP Power Problem: ఏపీలో విద్యుత్ సమస్య పక్కదారి.. పరిష్కారం దొరికేదెన్నడూ?
దీనికి అనుగుణంగానే జగన్ ప్రభుత్వం తాజాగా మూడు వేల కోట్లను విద్యుత్ సంస్కరణలకు ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. పైగ జగన్ ప్రభుత్వం ఇచ్చిన రాత పూర్వక హామీ కారణంగా.. రైతులకు విద్యుత్ మీటర్లు పెడుతున్నారు అధికారులు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ చట్టం ప్రకారం అప్పుగా విద్యుత్ కొనేందుకు వీల్లేదు.
ఈ చట్టం ప్రకారం అప్పుగా విద్యుత్ కొనడానికి వీల్లేదు. పైగా ఏ రాష్ట్రం అయినా అప్పు కింద విద్యుత్ ఇస్తామని చెప్పినా కేంద్రం ఒప్పుకోదు. కాబట్టి ఎవరూ కరెంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదని స్వయంగా ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేస్తున్నారు. దీంతో అంతిమంగా ఏపీ ప్రజలు తీవ్ర కరెంట్ కోతలతో ఈ మండు వేసవిలో ఇబ్బందులు పడుతున్నారు.

ఇవన్నీ కూడా జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే జరుగుతోందని చెబుతున్నారు విశ్లేషకులు. ముందు నుంచే అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇన్ని సమస్యలు రాకపోయేవని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి ఆదాయ మార్గాలు వెతుక్కోకుండా కొత్త అప్పులవైపు పరుగులు తీస్తున్నారు జగన్. ఇదే ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.
Also Read:Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీం షాక్.. అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందే
[…] Ashok Gajapathi Raju: తమవి కాదన్న వ్యవహారంలో తలదూర్చడం.. అనక మొట్టికాయలు తినడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఈ మూడేళ్ల కాలంలో గిల్లికజ్జాలు అన్నీఇన్నీకావు. రాజకీయంగా తమకు ప్రతికూలమైన వారు ఎవరైనా? ఎంతటివారైనా అనవసరం. వారిని ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందడం పాలకుల వంతైంది. రాజైనా.. కింకరుడైనా తాము కనిపిస్తే మొకరిల్లాల్సిందే. తమ పల్లకిని మోయాల్సిందే. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలతో సాగింది ఈ మూడేళ్ల పాలన. న్యాయస్థానాలు ఉన్నాయి కదా సరిపోయింది. లేకపోతే ప్రభుత్వ పెద్దల బాధితులు వేలాదిగా పెరిగిపోయేవారు. […]