Plants : కాలం మారుతున్న కొద్ది చెట్లు కనుమరుగుతున్నాయి. అయితే పట్టణాలు, నగరాల్లో ఉండేవారు పర్యావరణం పై ఉన్న ప్రేమతో ఇంట్లోనే మొక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంపకం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో పాటు స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది. అయితే కొందరు ఇంట్లో ఆకర్షణీయంగా కనిపించేందుకు రకరకాల పూల మొక్కలను పెంచుకుంటారు. వీటిలో ఎక్కువగా ఎరుపు రంగు పూలు వచ్చే మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు పూల మొక్కలు ఏ వైపు ఉంటే ఇంటికి మంచిదో ఇప్పుడు చూద్దాం..
ఇంట్లో ఎరుపు రంగు పూలు మొక్కలు ఉండడం వల్ల ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఎరుపు రంగు మొక్కల వల్ల శక్తితో పాటు ఉత్సాహం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ఇలాంటి వివాదాలు ఉన్నా.. తొలగిపోయి ఐకమత్యంగా ఉండగలుగుతారు. కొన్ని రాశుల వారికి ఎరుపు రంగు కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎరుపు రంగు పూల మొక్కలు ఉండడం వల్ల అదృష్టం భరిస్తుంది. అంతేకాకుండా వారు ఏ పని మొదలుపెట్టిన విజయం సాధిస్తారు.
Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..
అయితే ఈ ఎరుపు రంగు మొక్కలను కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే అవగాహన లేకుండా కొన్ని దిక్కుల్లో ఉంచడం వల్ల ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది. ఇంతకీ ఎరుపు రంగు పూల మొక్కలు ఏవైపు ఉంటే మంచిది అంటే… వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు వైపు ఎరుపు రంగు పూల మొక్కలను ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలాంటి బాధలు లేకుండా జీవించగలుగుతారు. ఘర్షణ వాతావరణం నుంచి ఉపశమనం పొందుతారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
పడమర వైపున ఎరుపు రంగు పూల మొక్కలను ఉంచడం వల్ల ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. కుటుంబం సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో నిత్యం వాగ్వాదం ఉంటుంది. ఏదైనా పని మొదలు పెడితే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల పశ్చిమ దిక్కులో ఈ పూల మొక్కలను ఉంచకూడదు.
ఉత్తరం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను ఉంచడం శుభప్రదంగా ఉంటుంది. ఇటువైపు సూర్య రష్మి కూడా పడే అవకాశం ఉన్నందున మొక్కలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. అలాగే ఒక వ్యక్తి సంపద పెరగాలంటే ఎరుపు రంగు పూల మొక్కలను ఉత్తరం వైపు ఉంచాలి.
దక్షిణం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను ఉంచడం అంత మంచిది కాదు. ఇక్కడ ప్రతికూల శక్తి ఉండడంతో ఈ ప్రదేశంలో ఎరుపు రంగు పూల మొక్కలను ఉంచడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య చికాకు కలిగి దూరమవుతారు.
అయితే మొక్కలు పైన చెప్పిన విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొక్కలు ఎప్పుడూ ఎండిపోకుండా తాజాగా ఉండే విధంగా చూసుకోవాలి. లేకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉండే అవకాశం ఉంది.
Also Read : ఈ మొక్కలు మీ పెరటిలో నాటారా.. ఇక మీ జీవితం నాశనం కావడం ఖాయం