Precautions For Summer: రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతోంది. వడగాలులు వీస్తున్నాయి. సాధారణం కన్నా రెండు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాగల రోజుల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎంత ప్రభావం చూపుతుందో అని బెంగ పడుతున్నారు.

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండ తీవ్రతతో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు పలచటి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. నెత్తి మీద క్యాప్ లాంటి వాటిని పెట్టుకోవాలని చెబుతున్నారు. అలాగే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజకీయాల కంటే హీరోయిన్లు ఎక్కువయ్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?
ఉత్తర వాయువ్యం నుంచి వీచే వడగాలుల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు వస్తున్నట్లు తెలుస్తోంది. రాగల రోజుల్లో వీటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఏప్రిల్ లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరవచ్చని చెబుతున్నారు. ఎండ తీవ్రతతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శీతల పానీయాల జోలికి వెళ్లకూడదని చెబుతున్నారు. నిమ్మరసంతో నీళ్లు, మజ్జిగ తీసుకోవాలి. జిల్లాల అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచిస్తున్నారు. తాగునీరు, వైద్య శాఖ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఎలాంటి విపత్తులు చోటుచేసుకోకుండా అత్యవసర బృందాలను సిద్ధం చేస్తున్నారు.
Also Read: Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?