Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ అంటేనే ఊహించని టాస్క్ లతో నిత్యం గొడవలు పడుతూ రచ్చ రచ్చగా సాగుతుంది. అయితే గతంలో కంటే ఈ సారి నాన్ స్టాప్ అంటూ అలరిస్తున్న బిగ్ బాస్.. మరిన్ని కొత్త టాస్క్ లను తీసుకొస్తున్నాడు. అయితే ఈ కొత్త టాస్క్‌లను చూస్తుంటే మాత్రం.. నిత్యం గొడవలు పెట్టడానికే తెస్తున్నాడేమో అనిపిస్తోంది. అంతలా ఉంటున్నాయి ఆ టాస్క్ లు.

ఇక మొదటి నుంచి ఇద్దరే టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నారు. అందులో ఒకరు అఖిల్ సార్థక్, మరొకరు హీరోయిన్ బిందు మాధవి. వీరిద్దరూ కూడా చాలా ట్యాలెంటెడ్ గా గేమ్ ఆడుతున్నారు. ఇక మైండ్ గేమ్ లో కూడా ఇద్దరూ ఇద్దరే. అందుకే నామనేషన్స్ లో ఉంటున్న వీరిద్దరూ.. ఓటింగ్ లో టాప్ లోనే నిలుస్తున్నారు. కానీ ఇద్దరి మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అది మరోసారి బయట పడింది.
Also Read: Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?
ఐదో వారం కెప్టెన్సీ టాస్క్‌లను ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో కెప్టెన్సీ కోసం పోటీదారులను ఎంపిక చేయడం కోసం.. బిందు మాధవి, అఖిల్ సార్థక్ లకు విడాకుల సీన్ ను పెట్టాడు. వారిద్దరూ కోర్టులోకి వచ్చి విడాకులు తీసుకోవాలి. అయితే ఎవరిది తప్పు అని తేలితే వారి టీమ్ ఓడిపోయినట్టే. అందరూ ఊహించనట్టు గానే నటరాజ్ మాస్టర్ అఖిల్ తరఫున లాయర్ గా, యాంకర్ శివ బిందు తరఫున లాయర్ గా వచ్చారు. ఇక ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. ఎలిమినేట్ అయిన ముమైత్ కాన్ జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ క్రమంలో ఇరువురు లాయర్లు లాయర్లు బిందు, అఖిల్ తరఫున వాదనలు చేస్తున్నారు. ఈ టాస్క్ రూల్ ప్రకారం.. వాదనలు జరుగుతున్న సమయంలో రెండు టీమ్‌ల సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేయాలి. ఇంకేమ8ఉంది దొరికిందే సందు అన్నట్టు అఖిల్ టీమ్ సభ్యులు మొత్తం బిందు మాధవిపై మాటల దాడి చేశారు. ముఖ్యంగా అషు రెడ్డి, స్రవంతి, తేజస్వీ, అజయ్‌లు కలిసి బిందు మాధవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె క్యారెక్టర్‌పై దారుణమైన కామెంట్లు చేయడంతో బిందు మాధవి తట్టుకోలేకపోయింది.

దీంతో చేతిలో ఉన్న మైక్‌ను విసిరేసి ఏడుస్తూ తన బెడ్ మీదకు వెళ్లిపోయింది. చాలా సేపు ఆమె బెడ్ మీదనే ఏడుస్తూ పడుకుంది. ఎంత ఆరోపణలు చేసినంత మాత్రాన.. గతంలో ఎవరూ ఇలా మైక్‌ను విసిరేయలేదంటూ ఆమె మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అసలే నామినేషన్స్ లో ఉంది కాబట్టి.. ఓటింగ్ దెబ్బ తినొద్దని అనుకుందో ఏమో.. మళ్లీ వచ్చి టాస్క్ లో పాల్గొంది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో తెలియాల్సి ఉంది.
Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?