
Vastu : మనదేశంలో వాస్తుకు చాలా ప్రాధాన్యం ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకున్నా, స్థలం కొనుక్కున్నా వాస్తు కచ్చితంగా చూడాల్సిందే. స్థలం వాస్తుకు అనుగుణంగా లేకపోతే ఇల్లు కట్టుకోవడం మానేస్తాం. కానీ వాస్తు దగ్గర కాంప్రమైజ్ అవడం అనేది ఉండదు. అలా వాస్తు మన జీవితంతో ముడిపడి పోయింది. ఈనేపథ్యంలో ప్రతిది వాస్తు ప్రకారం ఉండాల్సిందే. లేదంటే మార్చేస్తుంటాం. అంత విలువ వాస్తుకు ఇస్తున్నాం. దీంతో మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే వాస్తు టిప్స్ పాటించాల్సిందే మరి. ఇల్లు సంతోషాలతో తులతూగాలంటే మనం కొన్ని తప్పులు చేయకూడదు.
ఆరు అంగుళాల కంటే..
మన ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉంచుకుంటాం. కానీ అవి మన వేలికంటే ఎత్తుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు అంగుళాల కంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలు మన ఇంట్లో ఉంటే ఇక దారిద్ర్యమే. ఇంట్లో సంతోషాలు పోతాయి. బాధలు పెరుగుతాయి. ఆరు అంగుళాల కంటే ఎత్తైన విగ్రహాలు ఉంటే వాటికి నిత్యం పూజలు చేయాలి. కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలి. అదంతా మనతోని కాదు. అందుకే ఆరు అంగుళాల కంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలు ఇంట్లోకి తీసుకురావడం అంత మంచిది కాదు.
సాలీ గ్రామం
సాలీ గ్రామం అనేది ఓ రాయి. ఇది నేపాల్ లో గండకీ నదీ ప్రాంతంలో దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకు నష్టాలే. ఈ రాయి చాలా శక్తివంతమైనది. ఆకర్షణీయంగా ఉంటుంది. పొరపాటున దీన్ని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామా అంతే సంగతి. వీటిని ఇంట్లో ఉంచుకుంటే కఠినమైన నియమాలు పాటించాలి. అందుకు మనం సరిపోం. అందుకే సాలీ గ్రామాలను ఇంటికి తేకూడదు. ఒకవేళ తీసుకొస్తే మన బతుకు మారిపోతుంది. దరిద్రం తాండవిస్తుంది.
ముళ్లచెట్టు
ఇంటి ఆవరణలో ముళ్ల చెట్టు ఉంచుకోవడం సురక్షితం కాదు. దీని వల్ల ముళ్లు గుచ్చుకున్నట్లే ఉంటుంది. దీనికి గులాబీ మొక్క మినహాయింపే. ఎందుకంటే గులాబీకి కూడా ముళ్లుంటాయి. దాని పూలు దేవుడికి సమర్పిస్తాం కనుక ఇది ఉంటే ప్రమాదమేమీ కాదు. కానీ రేగు చెట్టు ఉంటే బాధలే ఉంటాయి. నిత్యం గొడవలు జరుగుతాయి. ఇంట్లో సంతోషం ఉండకుండా అడ్డుకుంటాయి. అందుకే ముళ్లచెట్లను ఉంచుకోవడం సురక్షితం కాదని తెలుసుకోవాలి.