Gymkhana Ground Incident: నగరంలో భారత్, ఆస్టేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టికెట్టు విక్రయిస్తున్నారు. కొందరు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంకొందరు డైరెక్టుగా వచ్చి టికెట్ బుక్ చేసుకునేందుకు జింఖానా గ్రౌండ్ కు అభిమానుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో హెచ్ సీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ చూద్దామని ఆశించిన వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ తో పాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టికెట్ల విక్రయంలో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సక్రమంగా టికెట్లు అమ్మకుండా బ్లాక్ లో విక్రయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. వ్యవహారం వివాదంగా మారడంతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదితి ఆలియా, ఎస్ఐ ప్రమోద్ ఫిర్యాదులతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని చెబుతున్నారు.
టికెట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం సంచలనం కలిగించింది. దీనిపై ప్రజలు తీవ్ర స్థాయిలో గొడవలకు దిగడం తెలిసిందే. కొందరు టికెట్లు కావాలని జింఖానా గ్రౌండ్ గోడలు దూకి రావడంతో గొడవ పెద్దదైంది. నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హెచ్ సీఏ అభాసుపాలైంది. టికెట్ల విక్రయంలో చోటుచేసుకున్న మార్పులపై ఆందోళన నెలకొంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా ఆటపై ఇంతటి రాద్ధాంతం జరగడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో కొందరికి గాయాలు సైతం కావడంతో అందరిలో ఆగ్రహం పెరిగింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్ సీఏ అని తేలడంతో వారిపై చర్యలకు ఉపక్రమించింది. గాయాలపాలైన వారు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు హెచ్ సీఏ అధికారులపై కేసు నమోదు చేశారు. టికెట్ల విక్రయంలో జరిగిన వివాదానికి కారకులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ తో అందరిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి చొరవతో వివాదం ఇంకా పెద్దదవుతోంది. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్న చందంగా హెచ్ సీఏ వైఖరి వివాదాస్పదమవడం ప్రధాన కారణం.