Pleasure Marriage : ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని చోట్లైతే, వాటి గురించి మరో దేశంలో చెప్పినప్పుడు మరింత వింతగా అనిపిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక సంప్రదాయం గురించే తెలుసుకుందాం. ఒక చోట 15 రోజుల ఆనందం కోసం భార్య దొరుకుతుంది. అంటే, ఆ మహిళను 15 రోజుల పాటు తనతో ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోతారు.
లైంగిక కోరికలు తీర్చుకోవడమేనా?
ఇండోనేషియాలో పేద వర్గాలకు చెందిన మహిళలు డబ్బు కోసం తాత్కాలిక భార్యలుగా మారుతున్నారు. అంటే, ఈ మహిళలు దాదాపు 15 రోజుల పాటు ఎవరికైనా భార్యగా ఉంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఖర్చులు పెరగడంతో ఈ మహిళలు ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. తాత్కాలిక భార్యలుగా ఉన్న సమయంలో ఈ మహిళలు సదరు పురుషుడి లైంగిక కోరికలను తీర్చడంతో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు.
Also Read : థియేటర్ల బంద్ వెనుక ఆ నలుగురు.. విచారణకు మంత్రి ఆదేశం!
‘ప్లెజర్ మ్యారేజ్’ అంటే ఏమిటి?
ఈ పద్ధతిని ‘ప్లెజర్ మ్యారేజ్’ (ఆనందం కోసం పెళ్లి) లేదా ‘నికాహ్ ముతాహ్’ అని కూడా పిలుస్తారు. దీని కింద కొందరు మహిళలు ఒక సంవత్సరంలో ఇలాంటి 20-25 పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. ఈ పద్ధతి ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన పున్చక్ (Puncak) ప్రాంత ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం తన సహజ అందాలకు, అరబ్ ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పర్యటనకు వస్తుంటారు.
ఎంత డబ్బు లభిస్తుంది?
మధ్యప్రాచ్యం నుండి పర్యటనకు వచ్చే ధనవంతులైన టూరిస్టులు ఈ ప్రాంతాలకు వచ్చి ఇలాంటి తాత్కాలిక వివాహాలు చేసుకుంటారు. ఎవరికైతే డబ్బు చాలా అవసరమో, ఆ మహిళలు ఈ వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు. టూరిస్టులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ వివాహం ముగిసిపోతుంది. India.com, లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రికను ప్రకారం.. ఒక మహిళ తన 17వ ఏట 15 సార్లు ఇలాంటి పెళ్లి చేసుకున్నానని స్వయంగా అంగీకరించినట్లు తెలిపింది. సాధారణంగా, ప్రతి పెళ్లికి ఆమె 300-500 డాలర్లు (సుమారు రూ.25,000 నుండి రూ.42,000 వరకు) సంపాదిస్తుంది. ఈ ఆచారం సమాజంలో పేదరికం, నిస్సహాయతకు అద్దం పడుతోంది.