Kandula Durgesh : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి ధియేటర్లను( cinema theatres ) బంద్ చెయ్యాలని కొద్ది రోజుల కిందట ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని ప్రభావం పెద్ద సినిమాల విడుదలపై పడుతుందని అంత భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదలకు షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. అయితే థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. దీంతో ఈ అంశం యూ టర్న్ తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాలు సంచలనం గా మారాయి. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు టార్గెట్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read : సిక్కోలు మేజర్ కు ‘కీర్తి’ పతకం!
* విచారణకు ఆదేశం
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు( exhibitors ) తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం.
* హరిహర వీరమల్లు సినిమాకు అడ్డంకి..
సినీ పరిశ్రమకు చెందిన ఓ నలుగురు ప్రముఖులు హరిహర వీరమల్లు ( Harihara Veera Mallu )సినిమా విడుదల పై కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని జనసేన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి.. ప్రభుత్వ ఆదాయం ఎంత తగ్గుతుంది అనే కోణంలో వివరాలు సేకరించబోతున్నారని జనసేన తెలిపింది.
* ఎప్పటి నుంచో వివాదం
తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) థియేటర్ల యాజమాన్యాలతో ఎగ్జిబిటర్లకు ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఇప్పటివరకు అద్దెప్రాతిపదికన థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే అలా చేయడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరిపారు. ఈరోజు కూడా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనిపై ఏకంగా ఏపీ మంత్రి విచారణకు ఆదేశాలు ఇవ్వడం మాత్రం సంచలనంగా మారింది.
23-05-2025
అమరావతిజూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.…
— JanaSena Party (@JanaSenaParty) May 23, 2025