Game Changer: సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో రామ్ చరణ్… ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమా నుంచి ఆ ఫ్యామిలీ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో రామ్ చరణ్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘చిరుత ‘ సినిమా నుంచి ఇంతకుముందు వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు అన్ని సినిమాల్లో కూడా తన టాలెంట్ తో నట విశ్వరూపాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అయితే ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కనిపించలేదు. ఓన్లీ చిట్టిబాబు మాత్రమే కనిపించాడు అంటే ఆయన ఎంతటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద చాలావరకు ఫోకస్ అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రామ్ చరణ్ రెండు పాత్రల్లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడట. ఇక ఇప్పటికీ ఈ సినిమా యూనిట్ నుంచి కొన్ని లీకులైతే బయటికి వస్తున్నాయి. ఇక రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ఫ్లాప్ అయింది. ఇక దాని ఇంపాక్ట్ గేమ్ చేంజర్ సినిమా మీద ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
Also Read: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?
ఇక శంకర్ చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది.గేమ్ చేంజర్ సినిమా విషయంలో తను కూడా ఇన్వాల్వ్ అయి ఆ సినిమా రష్ మొత్తాన్ని చూస్తూ కొన్ని మార్చాలి అనే దానిమీద డిస్కషన్లు చేస్తున్నాడట. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ మార్కెట్ అనేది భారీగా డౌన్ అయింది. ఈ సినిమాతో సక్సెస్ అయితేనే ఆయన మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అంతే తప్ప లేకపోతే పాన్ ఇండియాలో ఆయనని స్టార్ డైరెక్టర్ గా ఎవరు గుర్తించరు.
ఆయన ఒకప్పుడు తోపు డైరెక్టర్ అయినప్పటికీ ఇండస్ట్రీలో ముందుకు సాగాలంటే మాత్రం ఎప్పటికప్పుడు వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను అందుకుంటు ముందుకు సాగాల్సిందే… ఒక్కసారి రిలాక్స్ అయ్యారంటే వాళ్ళని మించే దర్శకులు వస్తున్నారు. తద్వారా వాళ్లకు భారీ పోటీని ఇస్తున్నారు. కాబట్టి ఎవరికి వారు తమ సినిమాలా ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ సినిమాలు చేస్తేనే తప్ప ఇక్కడ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందలేరు…
రీసెంట్ గా ఈ సినిమా ఔట్ పుట్ మొత్తాన్ని చూసిన చిరంజీవి ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన నిర్ణయానికి సినిమా యూనిట్ కూడా కట్టుబడి ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి అనుగుణంగానే శంకర్ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇక మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలని రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కూడా భావిస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు!