Gifts for Mom : మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకోసం ఏమైనా గిఫ్టులు ప్లాన్ చేస్తున్నారా? అయినా అమ్మకు గిఫ్టులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆమె మనసు ఎప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఎంత పెద్ద కానుక ఇచ్చినా కూడా చాలా చిన్నదే అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత తన గురించి ఆలోచించడం మానేసి ఇక పిల్లల గురించే ఆలోచిస్తుంటుంది. అలాంటి అమ్మ కొంచెం సంతోషించాలి అంటే ఓ చిన్న గిఫ్టుతో ఆమెకు సర్ఫైజ్ చేస్తు బాగుంటుంది కదా. మరి ఈ మదర్స్ డేకు ఇలా ప్లాన్ చేయండి.
సెల్ ఫోన్.. మీరు కాస్త బడ్జెట్ గురించి ఆలోచించక పోతే అమ్మ దగ్గర ఫోన్ లేకపోతే ఈ గిఫ్టును ఇచ్చేయండి. గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్లు కొనిస్తుంటారు. అమ్మకు కొనియ్యడంలో తప్పు ఏంటి? వామ్మో ఫోన్ కొనాలంటే వేలు కావాలి అని ఆలోచించకండి. మీ వద్ద ఉంటే అమ్మ బయటకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతుంటే ఈ బహుమతిని ఇచ్చేయండి. మీరు ఎక్కడికి వెళ్లిన కాస్త తక్కువ టెన్షన్ పడుతుంది. ఒక్క ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. సో టెన్షన్ ఫ్రీ.
స్మార్ట్ వాచ్.. వాకింగ్ కు వెళ్లినా, హార్ట్ బీట్ తెలుసుకోవాలి అన్నా కూడా లేదంటే మరిన్ని ఫీచర్ల కోసం ఈ బహుమతి చాలా ఉపయోగపడుతుంది. కాస్త తక్కువ ధరలోనే వచ్చే ఈ బహుమతి మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది. అమ్మకు నచ్చుతుంది. మంచి వాచ్ లు వెయ్యి నుంచి 3 వేల వరకు కూడా ఉన్నాయి. మరి సెర్చ్ చేసేయండి.
చీర.. అమ్మకు ప్రేమతో ఓ పట్టుచీర కొని సర్ఫ్రైజ్ చేయండి. లేదంటే మదర్స్ డే రోజు అమ్మను షాపింగ్ కు తీసుకొని వెళ్లీ మమ్మీ.. నీకు నచ్చిన చీర తీసుకో అని చెప్పేయండి. జాగ్రత్త ఎంత అమ్మ అయినా అమ్మాయే కదా షాపింగ్ లు అంటే చాలా ఇష్టం. మరి కాస్త మీ బడ్జెట్ కూడా చెప్పేయండి ముందే.