https://oktelugu.com/

Child Precautions : పిల్లలను ఏసీలో పడుకోబెడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అందుకే ఆయిల్, మాయిశ్చరైజర్ , బేబీ లోషన్ లను రాయడం మర్చిపోకండి. ఆవ నూనె కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. ఛాతీ, పొత్తి కడుపు మీద కాస్త అప్లై చేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2024 / 10:12 PM IST

    Child Precautions, AC,

    Follow us on

    Child Precautions : ప్రస్తుతం ఎండల తీవ్రతను భరించలేక కూలర్లతో పాటు ఏసీలను కూడా ఉపయోగిస్తున్నారు. మధ్యతరగతి ఇంట్లో కూడా ఏసీలు ఉంటున్నాయి అంటే ఎండల తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సులభంగా ఈఎమ్ఐలు ఉండటంతో ఏసీలను కొనుగోలు చేయాలి అనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ దీని వల్ల సమస్యలు కూడా ఎక్కువే ఉంటాయి. అయితే మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారా? వారిని కూడా ఏసీ ఉన్న గదిలో పడుకో పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

    ఏసీలో కూడా పిల్లను, నవజాతి శిశువులను పడుకోబెడుతారు. కానీ ఇలా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి చల్లగా ఉంటుంది. మరో వైపు చికాకుగా కూడా ఉండదు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు అనారోగ్య పాలు అవడమే కాదు వారు సరిగ్గా నిద్ర పోరు కూడా. ఏసీ ఉష్ణోగ్రత మీద చాలా శ్రద్ధ వహించాలి. మీ అవసరానికి తగ్గట్టుగా ఉష్ణోగ్రతలను సెట్ చేసుకోవద్దు. పిల్లల గురించి ఆలోచించాలి. మీరు దానిని 19లో ఉంచితే శిశువుకు చాలా చల్లగా ఉంటుంది.

    ఏసీని 23 నుంచి 25 మధ్య ఉంచండి. మీకు కాస్త వేడిగా అనిపించినా ఏం కాదు. కానీ పిల్లల గురించి ఆలోచి0చండి. పిల్లలను ఏసీలో పడుకోపెడితే దుప్పటిని కచ్చితంగా కప్పండి. చిన్నారికి డ్రస్ కూడా సరిగ్గా వేయండి. కొందరు తల్లిదండ్రులు వేడి ఉందని పిల్లలకు డ్రస్ లేకుండా పడుకోపెడతారు. కానీ ఇలా చేయకండి. పిల్లలకు త్వరగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు వస్తాయి.

    నేరుగా ఏసీ గాలి కూడా పిల్లలకు తగలవద్దు. పిల్లలను కాస్త దూరంగా పడుకోబెట్టండి. మధ్యలో ఉంటే ఎక్కువ ఏసీ వస్తుంది. దీని వల్ల వారి ముఖం, అరికాళ్లు, తలపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త వహించండి. శిశువు బాడీ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి 3-7 గంటలు ఏసీలో పడుకుంటే చర్మం పొడిబారుతుంది. తేమను కోల్పోతారు. అందుకే ఆయిల్, మాయిశ్చరైజర్ , బేబీ లోషన్ లను రాయడం మర్చిపోకండి. ఆవ నూనె కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. ఛాతీ, పొత్తి కడుపు మీద కాస్త అప్లై చేయండి.