Petrol Bunk Services: దేశంలోని కోట్ల సంఖ్యలో వాహనదారులు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలను వాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై విధించే పన్నులు ఎక్కువగా ఉండటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వాహనదారులు పెట్రోల్ బంకులలో కొన్ని సేవలను ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ సదుపాయాలను పెట్రోల్ బంకులు కల్పించని పక్షంలో వాహనదారులు పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
పెట్రోల్ బంకులలో తాగునీటి వసతి సౌకర్యం కచ్చితంగా ఉండాలి. తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే వాహనదారులు చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులలో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలి. ఈ సౌకర్యాలు లేకపోయినా వాహనదారులకు వీటిని వినియోగించే అవకాశం ఇవ్వకపోయినా పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు.
మనం కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ లో 4 నుంచి 8 పైసలు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కొరకు ఖర్చు చేస్తున్నామని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పెట్రోల్ బంకులలో అత్యవసర సమయాల్లో ఫోన్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. ఏదైనా సమస్యలలో చిక్కుకుంటే సమీపంలోని పెట్రోల్ బంక్ ను సందర్శించి ఇతరులకు సులభంగా కాల్ చేయవచ్చు. పెట్రోల్ బంకుల యజమానులు వాహనదారులు గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి గాలి నింపే యంత్రంను అందుబాటులో ఉంచాలి.
ప్రతి పెట్రోల్ బంకులో ఫిర్యాదు పెట్టెతో పాటు ప్రథమ చికిత్స కిట్ కచ్చితంగా ఉండాలి. అందులో ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యతా ప్రమాణాలను, పరిమాణాన్ని తెలుసుకునే పరికరాలు సైతం అందుబాటులో ఉండాలి.
Also Read: Tatkal ticket: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇలా చేస్తే తత్కాల్ లో టికెట్ కన్ఫామ్?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Petrol bunk services are these six services free at petrol bunks
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com