https://oktelugu.com/

Good Habits: ఈ అలవాట్లు ఉన్నవారు కష్టాలకు అస్సలు భయపడరు..

స్కూలుకెళ్లే వయసులో చాలా మంది ఉపాధ్యాయులు కొన్ని మంచి అలవాట్ల గురించి చెబుతూ ఉంటారు. ఆ సమయంలో అర్థం కాకపోవచ్చు. కానీ పెద్దయ్యాకనైనా కొన్ని అలవాట్లను మార్చుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2024 / 05:19 PM IST

    Good Habits

    Follow us on

    Good Habits: జీవితం పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టసుఖాల సమ్మేళనం..అని కొందరు చెబుతూ ఉంటారు. వాస్తవానికి అందమైన జీవితం అనేది ఎవరికీ పుట్టుకతో రాదు. ఎవరి జీవితాన్ని వారే చక్కగా మలుచుకోవాలి. అందుకోసం అందమైన అలవాట్లను అలవర్చుకోవాలి. ప్రతీ వ్యక్తికి ఆనందంతో పాటు దు:ఖమూ ఉంటుంది. ఆనందం వస్తే ఎగిరిపడినప్పుడు.. దు:ఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. రెండూ సమానమే అని భావించాలి. అప్పుడు కష్టాలు భారంగా అనిపించవు. నేటి కాలంలో చాలా మంది చిన్న సమస్యకే పెద్ద భారంగా కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకునేంత వరకు తెగించుతున్నారు. కానీ కొన్ని అలవాట్లను చేసుకోవడం ద్వారా జీవితం అందంగా తయారవుతుంది. మరి ఆ అలవాట్లు ఏవో తెలుసుకుందామా..

    స్కూలుకెళ్లే వయసులో చాలా మంది ఉపాధ్యాయులు కొన్ని మంచి అలవాట్ల గురించి చెబుతూ ఉంటారు. ఆ సమయంలో అర్థం కాకపోవచ్చు. కానీ పెద్దయ్యాకనైనా కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. మంచి అలవాట్ల ద్వారా మంచి జీవితం ఉంటుంది. మంచి జీవితం కావాలనుకునేవారు ఈ అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు 16 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో పనులు చేస్తుంటాం కానీ మధ్య మధ్యలో కనీసం 10 నిమిషాల పాటు కొన్ని అలవాట్లను పాటించాలి.

    చాలా మంది నేటి కాలంలో ఉదయం 9 దాటితే గానీ దుప్పటి తీయరు. కొందరు ఉద్యోగులు సమయ పాలన లేకుండా నిద్రలేచి గాబరాగా రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. వాస్తవానికి ఉదయం 5 లేదా 6 గంటలకు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేవగానే ఫోన్ లేదా టీవీ చూడకుండా కనీసం గంట పాటు వ్యాయామం చేయాలి. అది వాకింగ్ కావొచ్చు.. లేదా యోగా కావొచ్చు.. ఆ తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇది లైట్ ఫుడ్ అయితే మరీ మంచిది.

    స్కూలుకెళ్లే విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసేవారి వరకు ఏదో రకంగా ఒత్తిడికి గురవుతారు. ఈ క్రమంలో మనసు పాడవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన తరువాత కనీసం 20 నిమిషాల పాటు మంచి పుస్తకాన్ని చదవాలి. కొత్త పుస్తకం చదవడం వల్ల మనసు రిలాక్స్ గా మారుతుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండాలి. రోజులో వీలైనప్పుడు కనీసం 15 నిమిషాల పాటు మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇలా మౌనంగా ఉండి తానేం చేశానని, ఏం చేయాలనుకుంటున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

    ఒత్తిడి కారణంగా చాలా మంది సరైన నిద్ర ఉండడం లేదు. దీంతో పడుకునే ముందు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. లేదా కళ్లు మూసుకొని ఏదైనా ఒక విషయంపై బాగా ఆలోచించాలి. ఇలా చేస్తే మైండ్ షార్ప్ అవుతుంది. ఎప్పుడూ నెగెటివ్ విషయాల గురించి ఆలోచించకూడదు. జరిగేదంతా మనమంచికే అనుకుని ముందుకు సాగాలి. ఈ అలవాట్లు కనుగా పాటిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా పరిష్కరించగలుగుతారు.