Bajaj Chetak Scooter: ద్విచక్ర వాహనాల్లో రారాజుగా నిలిచింది బజాజ్ చేతక్. ఇదే పేరుతో ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఓ వైపు చమురు ధరలు పెరగడంతో పాటు మరోవైపు వాతావరణ కాలుష్యం కారణంగా ఈవీలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐతర్ లాంటి కంపెనీలు ఈ బైక్ లను రోడ్లపై విజయవంతంగా తిప్పుతోంది. ప్రముఖ బజాజ్ కంపెనీ తాజాగా చేతక్ పేరుతో సరికొత్త వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది.
బజాజ్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ 2024 పేరుతో రిలీజ్ అయిన రెండు వేరియంట్లు ఆకర్షిస్తున్నాయి. దీని ఫీచర్స్ నేటి కాలానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ ఈవీలో 3.2 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 127 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ కావడానికి 4.30 గంటల సమయం పడుతుంది. ఈ వాహనం గంటకు 73 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. వీటికి అదనంగా బ్లూ టూత్, నోటిఫికేషన్ అలర్ట్, టీఎఫ్ టీ డిస్ ప్లే, టీబీటీ నేవిగేషన్ సపోర్ట్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బజాజ్ చేతక్ ప్రీమియం ధరను 1,35,463 ఎక్స్ షో రూం ధరగా నిర్ణయించారు. చేతక్ అర్బన్ వాహనాన్ని 1,15,001 లో విక్రయించనున్నారు. బ్లూ, బ్లాక్ తో పాటు బ్రూక్లిన్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ లేటేస్ట్ ఈ వీ బైక్ లను బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్ సైట్ లేదా షోరూంలకు వెళ్లాలని ఆ కంపెనీ అధ్యక్షుడు ఎరిక్ వాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్ 2.88 కిలోవాట్ల బ్యాటరీ, సింగిల్ చార్జింగ్ తో 113 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేది.