Mountain : ఈ భూమి మీద టెక్నాలజీ పెరుగుతుంది. కానీ వింతలు విడ్డూరాలు మాత్రం అసలు ఆగడం లేదు. ఎవరు కనిపెట్టలేని విచిత్రాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎవ్వరికి తెలియని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల గురించి తెలిస్తే వింతగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి వింతలు ఉన్నయా అని ప్రతి ఒక్కరు ఆలోచనలో పడతారు.
ఇదంతా పక్కన పెడితే మీకు పర్వతాల గురించి తెలుసు కదా. అయినా పర్వతాల గురించి తెలియని వారు ఉంటారా? ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పర్వతాలలో కొన్ని అందంగా కూడా కనిపిస్తాయి. కదిలించడం కష్టమే. ఆలోచన కూడా కష్టమే. పగలకొట్టి రాయిని బయటకు తీయ్యాలన్నా కష్టమే. విచ్ఛిన్నం చేయాలి అనుకున్నా కష్టమే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పర్వతం చాలా వింత పర్వతం. దీని గురించి తెలుసుకున్న తర్వాత మీరు పక్కా షాక్ అవుతారు. ఇంతకీ అదేంటి అంటే?
ఆ పర్వతానికి దగ్గరలో ఉండే ప్రజలు దాన్ని చూడటం మాత్రమే కాదు తింటారు కూడా. పర్వతాన్ని తినడమా? అని పరేషాన్ అవుతున్నారా? అదొక ద్వీపం. జంబూద్వీప్ నైరుతి విభాగంలో ఉంది ఈ ప్రాంతం. అయితే ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో పెర్షియన్ గల్ఫ్ నీలి జలాల మధ్యలో కొలువైంది ఈ ద్వీపం.
ఈ ద్వీపాన్ని చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. మెస్మరైజ్ చేస్తుంది ఇది. దీని పేరు హార్ముజ్ ద్వీపం. దీనిని రెయిన్‌బో ద్వీపం అని కూడా అంటారు. ఈ దీవి అందం గురించి ప్రపంచానికి చాలా వరకు తెలియదు.. ఈ ద్వీపాన్ని డిస్నీల్యాండ్ ఆఫ్ జియాలజిస్ట్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడి రంగురంగుల పర్వతాలు, అందమైన ఉప్పు గనులు, బంగారు కాలువలు, ఉన్నాయి. ఇవి మనసును ఆకర్షిస్తాయి.
కేవలం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ ద్వీపం. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ అగ్నిపర్వత రాయి, శిలలు, ఇనుము, మట్టి, ఎరుపు, పసుపు, రంగులలో మెరుస్తుంటాయి. వీటిని చూస్తే ఇది భూమేనా లేక భూతలస్వర్గమా అనిపిస్తుంది. ఇది నిజంగా భూమి కాదు మరొక ప్రపంచమేమో అంటారు. ఇక్కడి రాళ్లకి సూర్యుడి కిరణాలను తాకితే చాలు అవి తళుక్కున మెరుస్తాయి. ఇక ఇక్కడ 70 కంటే ఎక్కువ రకాల ఖనిజాలు లభిస్తాయి.
ఈ ద్వీపం వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు, ఉప్పు దిబ్బలు దీన్ని సుందరంగా మార్చాయి. ఇక్కడ మరో వింత ఏంటి అంటే? ఇక్కడ ఉన్న పర్వతం. ఇది ప్రపంచంలో తీనదగిన ఏకైక పర్వతం. మరి మీకు ఇంకా అర్థం కాలేదు కదా. అయితే ఈ పర్వతాలు మందపాటి ఉప్పు పొరలతో ఏర్పడి ఉంటాయి.
వివిధ రకాల ఖనిజాల వల్ల ఈ ద్వీపం నేల కూడా కారం రుచిని కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తున్నారు అక్కడి ప్రజలు. ఎర్రమట్టిని చట్నీగా తింటారు. అంతే కాకుండా స్థానిక కళాకారులు ఇక్కడ ఉన్న ఎర్రమట్టిని పెయింటింగ్‌లో వాడుతుంటారు. ప్రజలు తమ బట్టలకు రంగు వేసుకోవడానికి కూడా వినియోగిస్తారు.