https://oktelugu.com/

YEAR ENDER 2024: మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలివే!

కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక వసూళ్లు కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు హిట్ టాక్‌ను సంపాదించుకున్న కూడా అత్యధిక వసూళ్లు రాబట్ట లేకపోయాయి. మరి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆ సినిమాలేవో చూద్దాం.

Written By: , Updated On : December 29, 2024 / 05:12 AM IST
Pushpa 2

Pushpa 2

Follow us on

YEAR ENDER 2024: మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తి కాబోతుంది. అయితే ఈ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలు హిట్‌లు సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫ్లాప్‌లు అయ్యాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక వసూళ్లు కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు హిట్ టాక్‌ను సంపాదించుకున్న కూడా అత్యధిక వసూళ్లు రాబట్ట లేకపోయాయి. మరి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆ సినిమాలేవో చూద్దాం.

పుష్ప 2 ది రూల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప 2 మూవీ మొదటి రోజు నుంచి అత్యధిక వసూళ్లు రాబట్టింది. పుష్ప సినిమా పార్ట్ 1 విడుదల చేసిన మూడేళ్లకు ఈ సినిమా వచ్చింది. మంచి హైప్‌తో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డును బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టింది. మైత్రి మూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.288.5 కోట్లు రాబట్టింది. సినిమా కలెక్షన్లు రికార్డులు సృష్టించాయి. మొత్తం మీద సినిమా రూ.1700 కోట్లు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

కల్కి 2898 ఏడీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే.. ఇక చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ సినిమా చూడటానికి ముందుగానే సిద్ధమైపోతార. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా మొదటి రోజు రూ. 191 కోట్లు రాబట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మొదటి సినిమాగా కల్కీ నిలిచింది. కానీ దీని తర్వాత పుష్ప 2 రావడంతో కల్కి రెండో స్థానంలోకి వెళ్లిపోయింది.

దేవర పార్ట్ 1
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు రూ.170 కోట్లు రాబట్టింది. గ్రాస్ ను వసూలు చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో దేవర పార్ట్ 1 మూడో ప్లేస్‌లో నిలిచింది.

గోట్
తమిళ స్టార్ హీరో విజయ దళపతి, స్టార్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు కాంబోలో గోట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు రూ. 105 కోట్లు రాబట్టింది. విజయ్ సినిమాల్లో గోట్ బెస్ట్ సినిమాగా నిలిచింది.

స్త్రీ 2
లేడీ ఓరియంటెడ్ వచ్చిన స్త్రీ 2 మూవీ మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.91 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన ఐదో సినిమాగా నిలిచింది.

గుంటూరు కారం
డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరికి వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు రూ.90 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలై మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన ఆరో చిత్రంగా గుంటూరు కారం నిలిచింది.