Sarees : అమ్మాయిలు, అబ్బాయిల వస్త్ర ధారణ పూర్తిగా మారిపోయింది. గతంలో అమ్మాయిలు ఎక్కువగా చీరకట్టుకోవడాన్ని ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం వెస్ట్రన్ డ్రెస్సులకు ఓటు వేస్తున్నారు యువత. కానీ అప్పుడైనా ఇప్పుడైనా చీర కట్టుకున్న తర్వాత స్త్రీల అందం రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆఫీస్, ఫంక్షన్, పార్టీ ఏదైనా సరే రకరకాల చీరలతో మీ అందాన్ని పెంచుకోవచ్చు. అందరిలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవాలంటే చీర ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. చీరకట్టులో ఉన్న అందం మిగతా దుస్తులు రాదు అంటే మీరు ఒప్పుకుంటారా లేదా?
మన ఇండియన్స్ మాత్రమే కాదు ఇతర దేశాల మహిళలు కూడా చీరలను చాలా ఇష్టపడతారు. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో చీరలకే ఓటు వేస్తారు. చీర అనేది ఏ సందర్భంలో ధరించినా సరే అందంగానే ఉంటుంది. మెజారిటీ మహిళలు ప్రతిరోజూ చీరలనే ఎక్కువగా కనిపిస్తారు. వారు చీరలోనే అందం ఉంటుంది అని నమ్ముతారు.
అయితే ఎత్తు తక్కువ ఉన్న మహిళలు అంటే పొట్టి మహిళలు చీర కట్టుకోవడానికి వెనకాడుతుంటారు. ఎందుకంటే చీర ధరించడం వల్ల తమ ఎత్తు మరింత తక్కువగా కనిపిస్తుంది అని భయపడతారు. ఈ పొట్టి మహిళలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్ పాటిస్తే మీరు పొడుగ్గా, నాజుగ్గా కనిపిస్తారు. మరి ఆ టిప్స్ ఏంటి అంటే?
చీరకట్టుకున్నప్పుడు పొడుగ్గా కనిపించాలి అంటే చీర ఎంపిక మస్ట్. ఎత్తు తక్కువగా ఉన్న స్త్రీలు వెడల్పాటి బార్డర్లు ఉన్న చీరలను అసలు ఎంచుకోవద్దు. ఇలాంటి చీరలు మీ ఎత్తును మరింత తక్కువగా చూపిస్తాయి. బార్డర్ హైలెట్ అవుతుంది కాబట్టి చిన్న బార్డర్ ఉన్న చీరనే ధరించాలి. సన్నని అంచులతో ఉన్న చీరలు మిమ్మల్ని పొడువుగా, నాజుగ్గా కనిపించడంలో సహాయం చేస్తాయి.
చీర మాత్రమే కాదు బ్లౌజ్ కూడా చాలా ముఖ్యం. మీరు ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే, నెక్లెస్ బ్లౌజ్ అసలు వేసుకోవద్దు. మీ కంఫర్ట్‌కి అనుగుణంగా V-నెక్ లేదా డీప్ నెక్ బ్లౌజ్ లు మంచి రిజల్ట్ ను అందిస్తాయి. ఇక ఎల్లప్పుడూ సాఫ్ట్ ఫాబ్రిక్ చీరను కట్టుకోవాలి. బనారసి సిల్క్, కంజీవరం సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ చీరలు మిమ్మల్ని పొట్టిగా, బరువుగా కనిపించేలా చేస్తాయి. అందుకే ఆధునిక తేలికపాటి పట్టు చీరల్ని చూజ్ చేసుకోవడం బెటర్. ఇవి శరీరానికి దగ్గరగా అతుక్కొని ఉంటాయి. ఇవి మిమ్మల్ని సన్నగా, పొడుగ్గా చూపిస్తాయి. షిఫాన్ లేదా జార్జెట్ చీరలను ధరించాలి. వీటి వల్ల కూడా మీరు హైట్ ఎక్కువ కనిపిస్తారు.
నిలువుగా ఉండే చారల చీరలను బెటర్. వర్టికల్ స్ట్రిప్స్ ఉండేలా చూసుకోండి. ఇక చారల చీరలు కట్టేటప్పుడు ఎక్కువ బార్డర్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం మానేయండి. బార్డర్ తక్కువ ఉండాలి. చీరకట్టులో పొడుగ్గా కనిపించాలంటే.. ముదురు రంగు చీరల్ని బెటర్.కొన్ని చీరలు కొందరికి సెట్ కావు. చీరల్ని ఫిజిక్ ఆధారంగా ఎంపిక్ చేసుకోవడం బెటర్. బరువు, ఎత్తును బట్టి ఎంచుకోవాలి. దీని వల్ల మీ అందం పెరుగుతుంది. చీరలకు సెట్ అయ్యే నగలు, చెప్పులు కూడా మ్యాచ్ చేసుకోండి. మరింత అందంగా కనిపిస్తారు.