PBKS vs GT Match Prediction: ఐపీఎల్ లో రసవత్తరమైన ఆటలు మొదలయ్యాయి. మొన్నటి వరకు కాస్త చప్పగా సాగిన మ్యాచ్‌లు కాస్తా.. ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. తక్కువ స్కోర్ చేసినా కూడా.. కాపాడుకునేందుకు టీమ్‌లు బలంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇరు జట్ల నడుమ హోరా హోరీ సాగుతోంది. ఈ రోజు కూడా ఓ రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది.

ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో టాప్ 5 లో ఉన్న టీమ్‌లు బలాన్ని చూపించబోతున్నాయి. ఈరెండు కూడా సమవుజ్జీవులే. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ రెండూ పోటీపడబోతున్నాయి. ఇందులో గుజరాత్ రెండు విజయాలు నమోదు చేస్తే.. పంజాబ్ మాత్రం ఒక ఓటమి, ఒక గెలుపుతో మూడో గేమ్‌ను స్టార్ చేయబోతోంది.
బలమైన జట్లను ఓడించిన ఈ రెండు టీమ్‌లు ఈరోజు ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోబోతున్నాయి. ఇక ఢిల్లీకి సన్ రైజర్స్ మాజీ ప్లేయర్ అయిన జానీ బెయిర్‌స్టో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది. అతన్ని భానుక రాజపక్స ప్లేస్ లో తీసుకోబోతున్నారు. పంజాబ్ లో ఎక్కువగా స్టార్ ఆల్ రౌండర్లు కనిపిస్తున్నారు.
మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో చాలా బలంగా తయారైంది పంజాబ్. అర్ష్‌దీప్ సింగ్ తో పాటు శిఖర్ ధవన్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో లాంటి బ్యాట్స్ మెన్లతో పటిష్టంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో రాహుల్ చాహర్, షారుఖ్‌ఖాన్ లాంటి వారు ఉన్నారు. లియామ్ లివింగ్‌స్టోన్, నాథన్ ఎల్లీస్, భానుక రాజపక్స లాంటి బౌలర్లు కూడా ఉన్నారు. వీరందరూ దాదాపు అటు బంతితోనూ.. ఇటు బ్యాట్ తోనూ మాయ చేయగలిగిన వారే.

ముఖ్యంగా పంజాబ్ తరఫున లియామ్ లివింగ్‌స్టోన్ బలమైన వెపన్ లా ఉన్నాడు. అతను ఆల్ రౌండర్ గా చెలరేగి ఆడుతున్నాడు. అతను ఫామ్‌లో ఉండటం కలిసి వచ్చే అంశం. అయితే గుజరాత్ కూడా ఓటమి ఎరగని జట్టుగా దూసుకుపోతోంది. ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ బలమైన జట్లను ఓడించి అగ్ర స్థానంలో నిలబడింది.
ఈ జట్టులో కూడా ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ మీద, ఢిల్లీ కేపిటల్స్ మీద విజయం సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసింది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో అప్రతిహతంగా దూసుకుపోతోంది. శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ లాంటి స్టార్ బ్యాట్స్ మెన్లు ఉన్నారు. అలాగే మహ్మద్ షమీ లాంటి బౌలర్లతో పటిష్టంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో చూడాలి.