Home Loan: 25 సంవత్సరాల్లో చెల్లించాల్సిన ఇంటి రుణాన్ని 10 ఏళ్లలో ఇలా చెల్లించండి..

ఒకప్పుడు డబ్బును కూడబెట్టుకున్న తరువాత ఇల్లును నిర్మించుకునేవారు. కానీ ఈరోజుల్లో డబ్బు కూడబెట్టాలంటే జీవితమే గడిచిపోతుంది.

Written By: Chai Muchhata, Updated On : July 28, 2023 2:35 pm

Home Loan

Follow us on

Home Loan: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు. పెళ్లి చేయడం ఈరోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు.. కానీ ఇల్లు కట్టడమే గగనంగా మారింది. ఇళ్ల స్థలాల ధరలతో పాటు నిర్మాణ సామగ్రి రేట్లు విపరీతంగా పెరగడంతో సామాన్యలు ఇల్లు కట్టాలంటే భయపడిపోతున్నారు. ఒకప్పుడు డబ్బును కూడబెట్టుకున్న తరువాత ఇల్లును నిర్మించుకునేవారు. కానీ ఈరోజుల్లో డబ్బు కూడబెట్టాలంటే జీవితమే గడిచిపోతుంది. దీంతో బ్యాంకులు గృహ రుణాలు అందిస్తున్నాయి. అయితే చాలా మంది ఈ లోన్లు తీసుకున్నవారు వాటిని పూర్తి చేయడాకి లాంగ్ టైమ్ పెట్టుకుంటారు. కనీసం 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితి ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలా చేసుకోవడం వల్ల అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తక్కువ టైంలో మీ లోన్ తీర్చే మార్గాలు అనేకం ఉన్నాయి.

ఉదాహరణకు ఇల్లు కట్టుకోవడానికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. దీనికి 25 సంవత్సరాల పాటు ఈఎంఐ ద్వారా చెల్లించాలని ఫిక్స్ అయ్యారు. ఇందు కోసం 8.6 వడ్డీ రేటును నిర్ణయించారు. 25 సంవత్సరాలకు నెలకు రూ.38,591 చెల్లిస్తే 12 నెలల్లో రూ.4,63,090 అవుతుంది. అంటే మొత్తం 25 ఏళ్లపాటు రూ.1.15 కోట్లు చెల్లిస్తారు. ఇందులో మీ ప్రిన్సిపుల్ అమౌంట్ రూ.50 లక్షలు చెల్లిస్తే 65,77,250 వడ్డీ చెల్లిస్తారన్నమాట. అంటే అసలు తీసుకున్న మొత్తాని కంటే వడ్డీ ఎక్కువగా ఉందన్న విషయం గ్రహించాలి.

ఇలాంటప్పుడు మీరు వడ్డీని తగ్గించుకోవడానికి కొత్త ప్రణాళిక వేసుకోవాలి. మీకు రుణం ఇచ్చే సమయంలో 8.6 వడ్డీతో ఇచ్చారనుకోండి. కాలక్రమంలో వడ్డీ రేట్లు తగ్గొచ్చు.. పెరుగొచ్చు.. ఇదే సమయంలో మీ నెలవారి జీతం పెరగడం లేదా.. ఇతర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువ వచ్చే ఆదాయంతో ఈఎంఐని పెంచుకునే మార్గం ఉంది. అంటే అప్పటి వరకు ఉన్న మీ గృహ రుణాన్ని తిరిగి లోన్ గా తీసుకొని ఈఎంఐని నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సమయంలో తక్కువ వడ్డీ ఉంటే మీ రుణ భారం తగ్గుతుంది.

ఇదే కాకుండా బ్యాంకు అధికారులతో మాట్లాడి నెలనెలా డబుల్ ఈఎంఐని చెల్లించే సదుపాయం ఉందో కనుక్కోండి. ఇలా డబుల్ ఈఎంఐ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అదనంగా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో మీరు తీసుకున్న మొత్తానికి మాత్రమే పేమెంట్ చేయగలుగుతారు. ఇలా గృహ రుణాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందర్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. దీంతో మీకు అదనపు భారం తగ్గి వంటనే ఇల్లురుణం తీసుకోవచ్చు.