Parents teach Childerns:నేటి కాలంలో పిల్లలను చాలా క్రమ పద్ధతిగా పెంచితేనే భవిష్యత్తులో ఎంతో ఆనందంగా.. సాంప్రదాయంగా ఉంటారు. ప్రస్తుత కాలంలో అంతా సాంకేతిక యుగం నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు చిన్నపిల్లలు పెద్దల విషయంలో సరైన విధంగా ప్రవర్తించడం లేదు. ముఖ్యంగా పెద్దలకు గౌరవం ఇవ్వాలని అనుకోవడం లేదు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులదే ప్రధానంగా తప్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలకు పద్ధతులు, మర్యాదలను నేర్పడం ద్వారా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు ఎలా చేస్తే.. పిల్లలు అలా చేస్తుంటారు. ముఖ్యంగా దీనిని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అదేంటంటే?
అతిథులు దేవుళ్ళు వంటి వారు అని అంటారు. ఏదైనా ఇంట్లో కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అతిథులను పిలుస్తూ ఉంటాం. వారిలో చాలామంది దేవుళ్ళు ఉంటారని కొందరు నమ్ముతారు. అలా ఇంటికి వచ్చిన వారిని మర్యాదతో పలకరించాలి. అలాగే వారికి సరైన విధంగా సౌకర్యాలు కలిగించి సంతృప్తి పరచాలి. కానీ ప్రస్తుత కాలంలో కొందరు యువత పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు. వారికి సౌకర్యాలు కల్పించే విషయం పక్కన పెడితే.. కనీసం వారు ఇంటికి రాగానే లేచి నిలబడి స్వాగతం పలికే పని చేయడం లేదు. అంటే కనీస మర్యాద కూడా పాటించడం లేదు.
Also Read: అక్షరాలా 140 షాట్స్..’హరి హర వీరమల్లు’ ట్రైలర్ విజువల్స్ కి మైండ్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
కొంతమంది పిల్లలు అయితే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే.. కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని.. ఎవరో వచ్చారు అని తల్లిదండ్రులను పిలుస్తారు. ఎవరో ఇంటికి ఎందుకు వస్తారు? పరిచయం ఉంటేనే వస్తారు కదా.. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి కనీస మర్యాదలు చేయడం అలవాటు చేసుకోవాలి. వారితో తల్లిదండ్రులు ఈ అలవాటును చేయించాలి. ఎందుకంటే ఇంటికి వచ్చిన వారిని కనీస మర్యాదతో ఆహ్వానించడం వల్ల వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మరోసారి ఎప్పుడైనా ఇంటికి రావాలని అనుకుంటారు. అలాకాకుండా వారితో వింతగా ప్రవర్తిస్తే మరోసారి ఇంటి గడప కూడా తొక్కరు. అంటే పరోక్షంగా దేవుళ్లను ఇంటికి రావద్దని సంకేతం ఇచ్చినట్లు.
అందువల్ల ఇంటికి వచ్చే వారిని మర్యాదలతో ప్రవర్తించాలని పిల్లలకు చెప్పించాలి. వారికి చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేయడం వల్ల వారి జీవితంలో ఎప్పటికీ అదేవిధంగా నడుచుకుంటారు. ఇంటికి వచ్చిన వారి కి మాత్రమే కాకుండా బయట ప్రదేశాల్లోనూ పెద్దలతో మర్యాదగా మాట్లాడాలని.. వారితో చక్కగా ప్రవర్తించాలని చెబుతూ ఉండాలి. ఎందుకంటే పెద్దల విషయంలో గౌరవ, మర్యాదలు పాటిస్తే ఆ తర్వాత తరం కూడా వీరికి మర్యాదలు దక్కుతాయి. లేకుంటే ఆ తరం వారి పిల్లలు వీరిని కనీసం పట్టించుకోకుండా కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలను పెంచే విషయంలో దీని గురించి తప్పనిసరిగా చెబుతూ ఉండాలి. అంతేకాకుండా వారి ముందు తల్లిదండ్రులు ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల వారు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించడం.. పెద్దలకు గౌరవం ఇవ్వడం అనేది తప్పనిసరి అని వారికి చెబుతూ ఉండాలి.