Hari Hara Veeramallu: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) థియేట్రికల్ ట్రైలర్ రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ ని మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంచుకోబడిన కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. అభిమానులు థియేటర్స్ లో ఈ ట్రైలర్ సెలబ్రేషన్స్ ని వేరే లెవెల్ లో చేసుకోవడానికి ప్లానింగ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ఎలాంటి హంగామా ఉంటుందో, థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు అలాంటి హంగామా ఉంటుందని ఆశిస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల వరకు ఉంటుందట. పవన్ కళ్యాణ్ ఇందులో మూడు డైలాగ్స్ కొడుతాడు. ఆ మూడు డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణే రాసాడని సమాచారం.
అంతే కాకుండా అర్జున్ దాస్ ఈ ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ అందించాడట. అర్జున్ దాస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ‘ఖైదీ’,’మాస్టర్’ సినిమాల ద్వారా ఈయన మన ఆడియన్స్ కి సుపరిచితం. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వాయిస్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూడు నిమిషాల్లో 140 షాట్స్ ఉంటాయట. ఒక్కో షాట్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందని సమాచారం. ముఖ్యంగా 2:33 & 2:35 షాట్స్ నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అటెన్షన్ ని ఆకర్షించేలా ఉంటుందట. ఓవరాల్ గా ట్రైలర్ లో నాలుగు వావ్ మూమెంట్స్, రెండు క్లాప్స్ కొట్టి ఈలలు వేసే మూమెంట్స్ ఉంటాయట. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ట్రాన్స్ నుండి బయటకు రావడం కష్టమే అట, ఆ రేంజ్ లో ఉందని సమాచారం.
Also Read: మొన్న పావలా శ్యామల నిన్న పాకీజా నేడు ఫిష్ వెంకట్ MAA అసోసియేషన్ నిద్రపోతుందా?
కానీ పవన్ కళ్యాణ్ ట్రైలర్ లో మూడు డైలాగ్స్ రాసాడు అనే వార్త అభిమానులను కాస్త భయపెడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంతంగా రాసుకున్న స్క్రిప్ట్స్ కానీ, డైలాగ్స్ కానీ పెద్దగా పేలలేదు. పైగా ఇప్పుడు ఆయన సనాతనం అంటూ దేశమంతటా తిరుగుతున్నాడు. ఆ ప్రభావం తో సనాతనం మీద డైలాగ్స్ రాసి ఉంటాడా?, అలా రాస్తే యూత్ ఆడియన్స్ దానిని స్వీకరించగలరా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఎలా రాసి ఉంటాడో చూద్దామని మరికొంతమంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజంగా ట్రైలర్ పైన చెప్పిన విధంగా ఆడియన్స్ ని షాక్ కి గురి చేసేలా ఉంటే మాత్రం కనీవినీ ఎరుగని అంచనాలు ఈ చిత్రం పై ఏర్పడుతాయి. ఓపెనింగ్స్ విషయం లో అత్యధిక ప్రాంతాల్లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశాలు కూడా ఉన్నాయి.