Corona- Online Classes: కరోనా నాలుగో దశ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ మేరకు దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 3,377 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ కరోనా తన ప్రభావం చూపుతుందా అనే అనుమానాలలు అందరిలో వ్యక్తమవుతన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగితే ఎలా అనే దానిపై తల్లిదండ్రుల మనోగతం తెలుసుకునేందుకు ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఇందులో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కరోనా కేసులు పెరిగితే ఆన్ లైన్ క్లాసులే శరణ్యమనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

గత రెండేళ్లు పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ సంవత్సరమే తరగతులు కొనసాగినా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ విద్యా సంవత్సరమైనా సజావుగా పూర్తవుతుందా లేక కరోనా మహమ్మారి విజృంభించి అడ్డుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కరోనా మహమ్మారి గురించి ఆందోళన చెందుతున్నారు. కేసుల సంఖ్య పెరగొద్దని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Telugu TV Anchors Remuneration: వామ్మో.. బుల్లితెర వ్యాఖ్యాతల పారితోషికం అంతా?
ఇప్పటికే రెండు డోసులు వేసుకోవడంతో ఇక భయం లేదనే ఉద్దేశంతోనే ఉన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకాలు వేశారు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టిందని భావించారు. కానీ కొత్తగా కేసుల సంఖ్య పెరగడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. దీంతో ఏంచేయాలనే ఆలోచనలో పడిపోయారు. కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఎక్కువ మంది తల్లిదండ్రులు కేసుల సంఖ్య పెరిగితే ఆన్ లైన్ క్లాసులే ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కరోనా మూడు దశలు చూసినా ఇప్పుడు నాలుగో దశ రానుందని ఇదివరకే నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోననే బెంగ అందరిలో పట్టుకుంది. దీంతో భవిష్యత్ లో ఇంకా ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. అందుకే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైతే నష్టాలే కనిపించే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు సంస్థలు బోర్డులు తిప్పేసుకోవడంతో రోడ్డున పడ్డ చాలా మందికి ఉపాధి కరువైంది.
ఈ నేపథ్యంలో కరోనా నాలుగో దశ ముప్పు ఇంకా విస్తృతం కాకున్నా ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ సంవత్సరమైనా సజావుగా సాగుతుందనుకుంటే ఇప్పుడు కొత్తగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తాయో అంతుచిక్కడం లేదు. ఏదిఏమైనా కరోనా ప్రభావంతో ప్రపంచమే కకావికలం అవుతోందనేది సత్యం.
Also Read:
BJP Dr Parthasarathi: జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తాం: పార్థసారథి సంచలన ప్రకటన
Recommended Videos: