IPL 2022: ఐపీఎల్ హవా కొనసాగుతోంది. జట్లు పరుగుల వరద పారిస్తున్నాయి. విజయాల యాత్ర కొనసాగిస్తున్నాయి. కొన్ని జట్లు మాత్రం అపజయాలే మూటగట్టుకుంటున్నాయి. ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రికార్డులు ఓ సారి పరిశీలిస్తే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల గురించి ఆరా తీస్తే గమ్మత్తైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతవరకు జరిగిన మ్యాచుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్లలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు.

ఇతడు 200 మ్యాచుల్లో 684 ఫోర్లు కొట్టి రికార్డు సొంతం చేసుకున్నాడు. రెండో ఆటగాడి జాబితాలో విరాట్ కోహ్లి నిలవడం గమనార్హం. కోహ్లి 216 మ్యాచుల్లో 557 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు పదిలం చేసుకున్నాడు. ఇక ఢిల్లీ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మూడో స్థానం దక్కించుకున్నాడు. 155 మ్యాచుల్లో 550 ఫోర్లు కొట్టిన ఘనత ఇతడి సొంతం.
Also Read: Corona- Online Classes: కొవిడ్ తీవ్రత పెరిగితే ఆన్ లైన్ తరగతులేనా?

ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 221 మ్యాచుల్లో 508 ఫోర్లు బాది నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సురేష్ రైనా ఐదో స్థానంలో రాణిస్తున్నాడు. 205 మ్యాచుల్లో 506 ఫోర్లు తన ఖాతాలో వేసుకుని ఈ రికార్డు సాధించాడు. ఇక ఆరోస్థానంలో గౌతం గంభీర్ 154 మ్యాచుల్లో 492 ఫోర్లు బాది ఆరో ఆటగాడిగా నిలవడం తెలిసిందే.

ఇంకా రాబిన్ ఊతప్ప 201 మ్యాచుల్లో 481 ఫోర్లు బాది ఏడో స్థానంలో ఉన్నాడు. అజింక రెహానే 156 మ్యాచుల్లో 428 ఫోర్లు కొట్టి 8వ స్థానంలో నిలిచాడు. తొమ్మిదో స్థానంలో దినేష్ కార్తీక్ కొనసాగుతున్నాు. 222 మ్యాచుల్లో 418 ఫోర్లు కొట్టి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఏబీ డివిలియర్స్ చివరి స్థానం పదిలో ఉన్నాడు. 184 మ్యాచుల్లో 413 ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్ లో ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. బౌండరీలే లక్ష్యంగా ఫోర్లు బాదుతున్నారు. స్టేడియం నలుమూలల బంతితో విన్యాసాలు చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారికి పరుగుల పండగే. దీంతో అభిమానులు కూడా అదే రేంజిలో ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు అవధులు లేకుండా ఆడుతూ తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి ఫోర్ల వరద పారుతోంది.
Also Read:Telugu TV Anchors Remuneration: వామ్మో.. బుల్లితెర వ్యాఖ్యాతల పారితోషికం అంతా?
Recommended Videos:
[…] […]