Telugu TV Anchors Remuneration: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. యవ్వనం అయిపోయాక వృద్ధాప్యంలో ఏముంటుంది. ఇక రిటైరే. విశ్రాంతి తీసుకోవడమే అందుకే వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పుడు మన బుల్లితెర నటీమణులు పాటిస్తున్నారు. బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న వారి సంపాదన చూస్తూ ఔరా అనిపిస్తోంది. ఒక్కో షోకు వారు తీసుకునే రెమ్యునరేషన్ చూస్తుంటే మతిపోతోంది. ఎందుకంటే వారి గ్లామర్ ను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు.

బుల్లితెర యాంకర్లలో మొదట వినిపించే పేరు సుమ. ఈమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే దిట్ట. దాదాపు పది సంవత్సరాలుగా బుల్లితెరను ఏలుతున్న నటి. ఏ షో అయినా ఏ ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే. ఆమె ప్రాతినిధ్యం లేని కార్యక్రమం ఉండదంటే అతిశయోక్తి కాదేమో. తన హావభావాలతో అందరిని కట్టిపడేసే సుమ పారితోషికం వింటే మతి పోతోంది. ఆమె ఒక్కో షో కు దాదాపు రూ. 2.50 లక్షల వరకు వసూలు చేస్తుందనేది జగమెరిగిన సత్యం.
Also Read: Manoj Bajpayee: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టింది.. చిచ్చు రేపుతున్న నటుడు కామెంట్స్ !

జబర్దస్త్ యాంకర్ గా ఖ్యాతి గడించిన అనసూయ కూడా తన అందంతోనే మతిపోగొడుతోంది. కుర్రకారు గుండెల్లో చిచ్చు రేపుతూ జబర్దస్త్ షోను రంజింపజేసే వ్యాఖ్యాత. తన అందచందాలతో మాటలతో జబర్దస్త్ కు మరింత ప్రాణం తీసుకొస్తోంది. ఈమె పారితోషికం కూడా దాదాపు రూ. 2 లక్షల వరకు ఉంటోంది. అడపాదడప సినిమాల్లో కూడా నటిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. పుష్పలో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు ఆచార్యలో కూడా ఓ రోల్ చేసింది.

ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన అందంతో ఆకట్టుకుంటోంది. వ్యాఖ్యాతల్లో కూడా ఈమెకు ఎక్కువ అభిమానులుండటం తెలిసిందే. ఈమె ఒక్కో ఈవెంట్ కు రూ. 1.50 లక్షలు తీసుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఈమె సొంతం. ఏ షోకు వెళ్లినా అక్కడ తన మాటలతో మెస్మరైజ్ చేయడం రష్మీకి వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఆమెకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని తెలుస్తోంది.

మరో యాంకర్ శ్రీముఖి. ఈమె అందానికి కూడా చాలా మంది ఫిదా అవుతారు. అంతగా మంత్రముగ్గుల్ని చేసే ముద్దుగుమ్మగా ఆమెకు పేరు. బిగ్ బాస్ తరువాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. ఒక్కో ఈవెంట్ కు రూ. లక్ష వరకు తీసుకుంటోంది. టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తోంది. బిజీగా ఉండటంతో ఈమె డేట్స్ దొరకడం కష్టమే.

శ్యామల కూడా తనదైన శైలిలో రాణిస్తోంది. బుల్లితెరలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఈమె కూడా ఒక్కో ప్రోగ్రామ్ కు రూ. 40 వేల వరకు తీసుకుంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. బిగ్ బాస్ షో కు వెళ్లొచ్చిన తరువాత ఈమె రేంజ్ కూడా పెరిగిపోయిందని తెలుస్తోంది. మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది.

Also Read:Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !
Recommended Videos: