Donations: విరాళాలు.. సినిమా వాళ్లే ఇవ్వాలా ? రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వరు ?

Donations: ‘సినిమా వాళ్ళు ప్రజల సొమ్ముతోనే విలాసాలు చేస్తున్నారు, ప్రజల అభిమానంతోనే సినిమా వాళ్లు ఎదిగారు, వాళ్ళది వందల కోట్ల వ్యాపారం, కానీ.. వాళ్ళు మాత్రం కేవలం లక్షల్లో మాత్రమే విరాళాల్ని ప్రకటిస్తున్నారు. ఇదేం బుద్ధి ? అంటూ కొందరు బులుగు కార్మికులు, బులుగు నేతలు సినిమా వాళ్ళ పై ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు కదా. అదేంటి ? ఆ వరదల నీళ్లు కూడా […]

Written By: Shiva, Updated On : December 9, 2021 5:56 pm
Follow us on

Donations: ‘సినిమా వాళ్ళు ప్రజల సొమ్ముతోనే విలాసాలు చేస్తున్నారు, ప్రజల అభిమానంతోనే సినిమా వాళ్లు ఎదిగారు, వాళ్ళది వందల కోట్ల వ్యాపారం, కానీ.. వాళ్ళు మాత్రం కేవలం లక్షల్లో మాత్రమే విరాళాల్ని ప్రకటిస్తున్నారు. ఇదేం బుద్ధి ? అంటూ కొందరు బులుగు కార్మికులు, బులుగు నేతలు సినిమా వాళ్ళ పై ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు కదా.

Donations

అదేంటి ? ఆ వరదల నీళ్లు కూడా ఇంకిపోయి ఉంటాయి కదా. ఇంకా విరాళాలు ఏమిటయ్యా బాబు ? ఇది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. సరే.. నాయకులు మాటల ప్రకారం ఆలోచిద్దాం. నిజమే సినిమా వాళ్ళు ప్రజల సొమ్ముతోనే ఎంజాయ్ చేస్తున్నారు ? మరి రాజకీయ నాయకులు ఎవరి సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు ?. అన్నట్టు ఇంకో మాట కూడా అన్నారు.

సినిమా వాళ్ళు ప్రజల అభిమానంతోనే ఎదిగారు, కావొచ్చు. కానీ ప్రతిభతోనే అభిమానం దక్కుతుంది. కాబట్టి, ప్రతిభ ఉన్నప్పుడు దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. కానీ, రాజకీయ నాయకులు ఎలా ఎదిగారు ? ప్రజల ఓట్లతోనే కదా. మరి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకుని వాళ్ళ కష్టాలు చూడాల్సింది ఎవరు ? ఏ.. ? ప్రజలకు వరదలు, తుఫాన్లు వస్తే.. సినిమా వాళ్లే విరాళాలు ఇవ్వాలా ? ఏ.. ? రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వకూడదు ?

సరే, సినిమా వాళ్లే ఇవ్వాలి అనుకుందాం. వ్యక్తిగతంగా సినీ ప్రముఖులు ఇచ్చే విరాళాలు ఎన్నో ఉన్నాయి. మరి ఏ రాజకీయ నాయకుడు అయినా వ్యక్తిగతంగా ఇంతవరకు ఏ నాడు అయినా ఒక్క విరాళం అయినా ఇచ్చాడా ? ఇక సినీ నిర్మాణ సంస్థలు కూడా విరాళాలను ప్రకటిస్థాయి. మరి ఏ రాజకీయ పార్టీ అయినా ఇంతవరకు విరాళాలు ప్రకటించినట్లు విన్నామా ?

Also Read: Tollywood: ప్రముఖ హీరో శింబు సినిమా రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడా…

నిజానికి సినీ పరిశ్రమ పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, విరాళాల్ని సేకరించి.. వాటిని ప్రభుత్వాలకి అందిస్తోంది. ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే ఇది. ఎప్పుడూ మంచి చేసే పరిశ్రమ, ఒకసారి చేయలేదు అనుకుందాం, అంతమాత్రాన ఇక ఇండస్ట్రీ, ఇండస్ట్రీలోని వ్యక్తులు దొంగలా ? ఏ.. ఎన్నడూ మంచి చేయని రాజకీయ నాయకులు మాత్రం దేవుళ్లా ? ఇక నుంచైనా నాయకుల్లారా.. విరాళాలు ఇస్తే తీసుకోండి, అంతేగాని అడుక్కోకండి.

Also Read: Pushpa Movie: త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ ఇవ్వనున్న “పుష్ప” యూనిట్…

Tags