https://oktelugu.com/

Ahuti Prasad Son: క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ గుర్తున్నాడా..? ఈయన కొడుకు కూడా టాలీవుడ్ లో పెద్ద హీరోనే..ఎవరో గుర్తుపట్టండి!

చందమామ చిత్రం తర్వాత ఆహుతి ప్రసాద్ దాదాపుగా 85 చిత్రాలలో నటించాడు. దీనిని బట్టి ఈ సినిమా ఆయన కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో అర్థం చేసుకోవచ్చు. అలా దూసుకుపోతున్న ఆహుతి ప్రసాద్ దురదృష్టంకొద్దీ 2015 వ సంవత్సరం లో తన చివరి శ్వాసని వదిలేయాల్సి వచ్చింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2024 / 03:00 AM IST

    Ahuti Prasad Son

    Follow us on

    Ahuti Prasad Son: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటులకు కొదవే లేదు. నిన్నటి తరం నటీనటులను తీసుకున్నా, నేటి తరం నటీనటులను తీసుకున్న మన ఇండస్ట్రీ లోని నటులకు సాటి వచ్చే వాళ్ళు లేరు. మన తెలుగు సినిమా స్థాయి నేడు ప్రపంచపటంలో అగ్రస్థానం లో నిల్చిందంటే, అందుకు మూలకారణం మన నటీనటులే. కేవలం హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు. క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా మన ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు ఆహుతి ప్రసాద్. అక్కినేని నాగార్జున మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్’ ద్వారా ఈయన వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆహుతి ప్రసాద్ కి మాత్రం చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు కానీ, ఈ సినిమా ద్వారా ఆయనకీ అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి.

    ఈ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరం లో ఆయన డాక్టర్ రాజశేఖర్ కాంబినేషన్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆహుతి’ అనే చిత్రం లో అద్భుతమైన క్యారక్టర్ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా ప్రసాద్ కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషించాడు కాబట్టే, ఆహుతి అనే టైటిల్ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అలా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆహుతి ప్రసాద్, సుమారుగా 177 సినిమాల్లో నటించాడు. నేటి తరం ఆడియన్స్ కి ఆయన ‘చందమామ’ చిత్రం ద్వారా బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా ఆహుతి ప్రసాద్ కి తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన తదుపరి చిత్రానికి థియేటర్స్ బయట కటౌట్స్ పెట్టే రేంజ్ పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది ఈ చిత్రం.

    చందమామ చిత్రం తర్వాత ఆహుతి ప్రసాద్ దాదాపుగా 85 చిత్రాలలో నటించాడు. దీనిని బట్టి ఈ సినిమా ఆయన కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో అర్థం చేసుకోవచ్చు. అలా దూసుకుపోతున్న ఆహుతి ప్రసాద్ దురదృష్టంకొద్దీ 2015 వ సంవత్సరం లో తన చివరి శ్వాసని వదిలేయాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఆహుతి ప్రసాద్ కి కార్తీక్ ప్రసాద్, భరణి ప్రసాద్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈయన సంతోష్ శోభన్ హీరో గా నటించిన కళ్యాణం కమనీయం అనే చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరో గా కూడా చేసాడు కానీ, అవి అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఈయన ‘కళ్యాణం కమనీయం’ సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ఒక ప్రసంగం అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా ఆ వీడియో ని చూసేయండి.