Parenting Tips : ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం పెద్ద ప్రయాసగా మారింది. ఎందుకంటే సమాజంలో ఉండే వాతావరణం.. కొందరి మనుషుల కారణంగా పిల్లల్లో ప్రవర్తన భిన్నంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రకరకాల ఒత్తిడి కారణంగా పిల్లల ప్రవర్తనలో తేడా రావడంతో తల్లిదండ్రులు వారిపై కోపం తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల మాట వినడం లేదు. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ మాట వినడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే కొందరు కోపంతో పాటు వారిపై చేయి చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారు వినకపోగా.. మరింత సమస్యగా మారుతారు. అందువల్ల వారిని పెంచే క్రమంలో కొన్ని చిట్కాలను పాటించాలి. వీటి ద్వారా వారి మనసును మార్చే ప్రయత్నం చేయవచ్చు. అవేంటంటే?
Also Read : మార్కెట్లో ఇంజక్షన్ పుచ్చకాయలు.. నకిలీవి ఇలా గుర్తించండి
కోపం స్థానంలో శాంతం:
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను బెదిరిస్తూ ఉంటారు. భయం కారణంగా వారు తమ మాట వింటారని అనుకుంటారు. కానీ నేటి కాలం పిల్లలు తల్లిదండ్రులు ఎంత కోప్పడితే అంతా రివర్స్ అవుతున్నారు. అంటే వారికి భయం కాకుండా వినకుండా ఉంటున్నారు. అయితే కొందరు శాంతంగా చెప్పడం వల్ల తల్లిదండ్రుల మాట విని అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు శాంతంగా చెప్పడం వల్ల వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
వారు చెప్పేది వినాలి:
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పేది అసలు వినరు. పైగా వారు చెప్పేది పట్టించుకోకుండా దూరం పెడతారు. ఈ క్రమంలో వారు నిరాశ చెందుతారు. తమ మాట వినని తల్లిదండ్రులు.. వారి మాట మేమెందుకు వినాలి? అనే చెడు భావన వారిలో కలుగుతుంది. అందువల్ల తల్లిదండ్రులకు ఎంత పని ఉన్న.. ఎన్ని రకాల బిజీ వాతావరణ ఉన్నా.. కొంత సమయం పాటు పిల్లలకు కేటాయించాలి. వారు చెప్పేది వినాలి. వారు చెప్పింది అర్థం చేసుకొని.. సరైన సమాధానం ఇవ్వాలి. అప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా వింటారు.
వారికోసం సమయం:
తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసినట్లయితే పిల్లలను పట్టించుకోవడానికి ఆస్కారం ఉండదు. ఈ క్రమంలో వారు సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా మారుతూ ఉంటారు. అంతేకాకుండా వారిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడంతో.. వారు తల్లిదండ్రులను పట్టించుకోరు. దీంతో వారు తల్లిదండ్రులు చెప్పేది వినరు. అయితే తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల కోసం ఒక గంట కేటాయించాలి. వీలైతే వారితో ఆడుకునే ప్రయత్నం చేయాలి. వారికి ఏదైనా సమస్యలు ఉంటే విని వాటిని పరిష్కరించుకోవాలి.
విహారయాత్రలకు:
చదువు కారణంగా పిల్లలు ఎప్పుడు ఒత్తిడితో కలిగి ఉంటారు. దీంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అయితే వారిని వీకెండ్ లో బయటకు తీసుకెళ్లాలి. పార్కు లేదా ఏదైనా బేకరీ షాప్ కు తీసుకెళ్లడం వల్ల కాస్త ఉల్లాసంగా మారుతారు. వీలైతే విహారయాత్రలకు కూడా వెళ్లాలి. ఇలా వెళ్లడం ద్వారా వారు ఎంతో సంతోషంగా ఉంటూ.. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. దీంతో తల్లిదండ్రులు చెప్పేదే వింటారు.