Watermelon :వేసవికాలం వచ్చిందంటే ఎండ వేడితో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చల్లదనం కోసం చల్లటి పానీయాలను సేవిస్తూ ఉంటారు. అలాగే ఆహార పదార్థాల్లోనూ మార్పులు చేస్తూ ఉంటారు. ఈ వేసవికాలం మొత్తం ఎక్కువగా ఉష్ణోగ్రతను అందించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండి.. శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అదే చాలామంది తెల్లదనం ఉండే పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. వీటిలో భాగంగా ఫ్రూట్స్ను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వేసవికాలం రాగానే ఎక్కువగా మార్కెట్లో పుచ్చకాయలు కనిపిస్తూ ఉంటాయి. వాటర్ మిలన్ తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిలతో పాటు.. ఉష్ణోగ్రతను తగ్గించే గుణాలు ఉన్నాయి. అందువల్ల చాలామంది వాటర్ మిలన్ తీసుకుంటూ ఉంటారు. అయితే వాటర్ మిలన్ తీసుకునే సమయంలో అది నకిలీదో? కాదో ?తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే?
Also Read : మార్కెట్లో మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారా? ఇలా ఉంటే అస్సలు తీసుకోకండి..
ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాలు అన్నీ కల్తీ మయంగా మారిపోతున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి కొందరు పండ్లను సైతం రకరకాలుగా రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. మామిడి పండ్లు ఆకర్షణీయంగా కనిపించడానికి ఇథలిన్ కలుపుతూ ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోల ప్రకారం.. పుచ్చకాయలో కూడా రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో గుజ్జు ఎర్రగా కనిపించేందుకు.. రుచిగా ఉండేందుకు ప్రత్యేకంగా ఇంజక్షన్లు వేస్తున్నట్లు బయటపడింది. అందువల్ల చాలామంది పుచ్చకాయను కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు రైతులు నిజాయితీగా తమ కాయాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో మార్కెట్లో చెడిపోయిన పుచ్చకాయలతో పాటు మంచివి కూడా ఉంటాయి. అయితే మంచివో కాదో తెలుసుకునేందుకు కొన్ని ట్రిక్స్ పాటించాలి. పుచ్చకాయ కొనే సందర్భంలో అది నకిలీతో కాదో గుర్తించలేం. కానీ దానిని కొనుగోలు చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల నకిలీదో కాదో గుర్తించవచ్చు. పుచ్చకాయను కోసిన తర్వాత ఒక మొక్కను తీసుకొని నీళ్లలో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ నీరు గులాబీ రంగులో మారిపోతే అందులో రసాయనాలు కలిపారని తెలుసుకోవాలి. అలా కాకుండా నేచురల్ గా ఉంటే అది నిజమైన పుచ్చకాయని తెలుసుకోవచ్చు.
అలాగే సగం కోసిన పుచ్చకాయపై ఒక టిష్యూ పేపర్ తో కాస్త రుద్దాలి. ఇలా రుద్దితే దానికి రెడ్ కలర్ ది ఏమైనా అంటితే అది రసాయనం కలిపిన పుచ్చకాయ అని తెలుసుకోవాలి. అలాకాకుండా ఎలాంటి రంగు అంటుకోకపోతే.. అది నిజమైన పుచ్చకాయ అని గుర్తించుకోవాలి. ఇలా పుచ్చకాయను నకిలీ ఏదో కాదో గుర్తించి ఆ తర్వాత తినే ప్రయత్నం చేయాలి.
కల్తీ పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిని ఫలితాలు తినడం వల్ల పేగు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్యాస్టిక్ సమస్యలు వచ్చి ఇబ్బందికి గురిచేస్తాయి. ఇది ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఇంజక్షన్ చేసినా పుచ్చకాయలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.