Parenting Tips: పిల్లల పట్ల తల్లులు ఈ తప్పులు కచ్చితంగా చేస్తుంటారు? మీరు కూడా అంతేనా?

తల్లులు పిల్లలతో కాస్త స్ట్రిక్ట్ గా ఉండొచ్చు తప్పులేదు. కానీ కఠినంగా మాత్రం ఉండకూడదు. ప్రతి విషయంలో రూల్స్ పెట్టి వాటిని పాటించాలి అనేట్టుగా మాత్రం ఉండకూడదు.

Written By: Swathi, Updated On : May 11, 2024 8:57 am

Parenting Tips

Follow us on

Parenting Tips: తల్లి ప్రేమ గురించి ఎంత మంది కవులు ఎన్ని విధాలుగా రాసినా దాన్ని వర్ణించడం కష్టమే. ప్రపంచంలోనే ఈ ప్రేమకు సరితూగేది మరొకటి లేదు. తాను ఆకలితో ఉన్నా సరే.. తమ బిడ్డల ఆకలి మాత్రం తీరుస్తుంది. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటుంది. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే చూస్తుంది. కొన్ని సార్లు తెలిసీ తెలియక చేసే తప్పులు పిల్లల మీద ప్రభావం చూపుతుంటాయి. అయినా పిల్లల విషయంలో తల్లి తప్పు చేస్తుందా అనుకుంటున్నారా? కొన్ని సార్లు పొరపాటుగా మాట్లాడిన మాటలు, చేష్టలు వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇంతకీ అవేంటి అంటే..

తల్లులు పిల్లలతో కాస్త స్ట్రిక్ట్ గా ఉండొచ్చు తప్పులేదు. కానీ కఠినంగా మాత్రం ఉండకూడదు. ప్రతి విషయంలో రూల్స్ పెట్టి వాటిని పాటించాలి అనేట్టుగా మాత్రం ఉండకూడదు. తల్లులు పిల్లలతో కాస్త సున్నితంగా ఉండాలి. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని పిల్లలకు చాలా స్పష్టంగా తెలియజేయాలి. తల్లి ఎప్పుడు కూడా ఎక్కువ కఠినంగా ఉండకూడదు. ఇలా ఉంటే మీ రిలేషన్ కూడా దెబ్బతింటుంది. మాట వినడం లేదంటూ అరవడం, కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ రిలేషన్ చాలా దూరం అవుతుంది.

కొందరు తల్లులు పిల్లు అల్లరి చేయగానే నాన్నకు చెబుతాను అంటూ భయపెట్టిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ మీద గౌరవం పోతుంది. ప్రతి విషయానికి నాన్న మీద ఆధారపడతారు అనే భావన వస్తుంది. మీరు కూడా ఇలాగే చేస్తే పిల్లల పెంపకంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి వెంటనే మీ ఈ అలవాటుకు గుడ్ బాయ్ చెప్పేసేయండి.

ప్రతి పేరెంట్స్ చేసే మరో పెద్ద కామన్ తప్పు ఏంటంటే.. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. ఒక్కోసారి పిల్లల లోపాలను ఎత్తి చూపి పక్కవారి పిల్లలతో పోల్చడం మొదలుపెడతాం, కొన్నిసార్లు అతని మార్కులు బాగా వచ్చినప్పుడు అదే తరగతికి చెందిన మరో పిల్లవాడితో పోల్చి చూస్తాం. ఇది మాత్రమే కాదు, చాలా మంది తల్లులు తమ ఇతర పిల్లలతో తమను తాము పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల మానసికంగా కుంగి పోవడమే కాదు ఎదుటి వారి మీద ద్వేషం కూడా పెంచుకుంటారు. కాబట్టి మీ పిల్లల విషయంలో మీరే జాగ్రత్తలు పాటించాలి.