Parenting: పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రతి విషయం గురించి చెప్పాలి. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే అలవాట్లు ఉండిపోతాయి. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులను ఒక రోల్ మోడల్‌గా చూస్తారు. ఆ సమయంలో పిల్లల కోసమైన తల్లిదండ్రులు మంచిగా ఉండాలి. ఎందుకంటే చిన్నతనంలో పిల్లలకు మంచి ఏది, చెడు ఏది తెలియదు. పెద్దవారు ఏం చేస్తే అదే మంచి, చెడు అని అనుకుంటారు. కాబట్టి పిల్లలకు చిన్నతనంలో మంచి విషయాలను మాత్రమే తల్లిదండ్రులు నేర్పించాలి. కొందరు తల్లిదండ్రులు ఇంట్లో సరిగ్గా ఉండలేక, గొడవలు పడుతూనే ఉంటారు. కనీసం గౌరవం లేకుండా కొట్టుకుంటారు. ఇలాంటివి అన్ని పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. వారు కూడా భవిష్యత్తులో అలా చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి పిల్లల ముందు తల్లిదండ్రులు అసలు ఎలా ప్రవర్తించకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు తల్లిదండ్రులకు పిల్లల ముందు ఎలా నడుచుకోవాలో కూడా సరిగ్గా తెలియదు. వీరు సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల వారి పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల ముందే సరసాలు ఆడటం, ముద్దులు పెట్టుకోవడం, గొడవలు పడటం వంటివి చేస్తుంటారు. ఇలా పిల్లల ముందు అసలు ప్రవర్తించకూడదు. మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. పిల్లల ఎదుట కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఏదైనా ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోని మాట్లాడుకోవాలని నిపుణులు అంటున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారని పట్టించుకోకుండా వారి ముందు గొడవ పడతారు. వీటిని చూసి పిల్లలు చాలా భయపడతారు. నిజం చెప్పాలంటే వారు మానసికంగా ఎంతో ఇబ్బంది కూడా పడతారు. వారికి జీవితం మీద భయం పెరుగుతుంది. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఇలాగే ఉంటుందని మైండ్‌లో ఫిక్స్ అయిపోతారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు ఆ భయాన్ని పొగోట్టాలి. కానీ వారే ఆ భయాన్ని పెంచితే పిల్లలు భవిష్యత్తులో ఎలా పెరుగుతారో మీరే ఆలోచించుకోండి.
పిల్లలకు తెలిసి తెలియని వయస్సులో తల్లిదండ్రులు చిన్న విషయాలకు సరదాగా అబద్ధాలు నేర్పుతారు. వారు వాటినే గుర్తుపెట్టుకుంటారు. పెద్ద అయిన తర్వాత మీ దగ్గర చెప్పడానికి అలవాటు పడతారు. చిన్నతనంలో సరదా అయ్యింది.. పెద్దయ్యాక వాళ్లు అలవాటు పడతారు. అలాగే కొందరు తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని అబద్ధాలు ఆడటం, ఇతరులను వెనుక పెట్టి మాటలు అనడం, పెద్ద వారికి ఎదురు సమాధానం చెప్పడం వంటివి చేస్తుంటారు. ఇలా తల్లిదండ్రులు పిల్లల ముందు అసలు ప్రవర్తించకూడదు. వీటివల్ల పిల్లలు కూడా భవిష్యత్తులో అలానే ప్రవర్తిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించకూడదు. వారికి అన్ని మంచి విషయాలు చెప్పడం అలవాటు చేయాలి. అప్పుడే వారు భవిష్యత్తులో మంచి పొజిషన్‌లో ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.